శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ

 గాయక్వాడ్ అనేది బడౌదా రాజవంశం పేరు. ఆవు రక్షకుడు  గాయ్ కా రక్షక్ అని అర్ధం. దేశ్ముఖ్ సర్దేశ్ ముఖ్  అనే ఉపనామాలున్నాయి.తాము రఘువంశంవారం అని చెప్తారు.పూనాకి చెందిన ధావీ అనే గ్రామం వీరిది.వీరి మూలపురుషుడైన దమాజీ1720లో నిజామ్ తో జరిగిన యుద్ధం లో  అపూర్వ పరాక్రమం చూపాడు. శాహూ మహారాజు సంతోషించి సమ్ శేర్ బహదూర్ అనే బిరుదు ఇచ్చాడు.దమాజీ తర్వాత పిలాజీ సేనాపతి ఐనాడు.గ్వాలియర్  ఖాన్దేశ్ లో కూడా గాయక్వాడ్ వంశ ఉపశాఖలున్నాయి.🌹
కామెంట్‌లు