న్యాయాలు -84
తిల తండుల న్యాయము
******
తిలలు అంటే నువ్వులు.తండులాలు అంటే బియ్యం. నువ్వులు బియ్యం రెండింటినీ కలిపినప్పటికీ వేటి రంగుతో అవి కనిపిస్తూ ఉంటాయి. ఇక నల్ల నువ్వులు ఐతే అసలే కలిసి పోవు. అంటే ఈ రెంటినీ ఎంత కలిపినా కలవవనే అర్థంతో ఈ తిల తండుల న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
వయస్సు మీద పడుతున్న సమయంలో తల మీద జుట్టు అక్కడక్కడా నెరవడం మొదలవుతుంది.అటు పూర్తిగా తెలుపు, పూర్తిగా నలుపు కాకుండా నెరిసీ నెరవని జుట్టుతో ఎవరైనా ఉంటే తిలతండులాల్లా ఉన్నాయని అనే వాళ్ళు.
ఈ మాటను శ్రీనాథుడు తన కాశీ ఖండంలో ఉపయోగించడం గమనించవచ్చు.వ్యాస మహర్షి కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోయే సమయంలో సాక్షాత్తు అన్నపూర్ణా దేవి అతన్ని వారించడానికి సామాన్య స్త్రీగా ప్రాకృత వేషంలో వస్తుంది.కాశీ అన్నపూర్ణ దేవిని వర్ణిస్తూ ఆమె జుట్టును తిలతండులాలుగా ఉన్నట్లుందని వర్ణిస్తాడు.
అల్లసాని పెద్దన తాను రాసిన మనుచరిత్రలో " పుడమి తిలతండుల న్యాయమున వెలుగ," అంటారు.
దీనినే దేశంలోని రాజకీయాలకు చక్కగా వర్తింప జేయవచ్చు. ఎన్నికల సమయంలో బలమైన ప్రతిపక్షాన్ని ఓడించడానికి కొన్ని పార్టీలు కలిసి ప్రచారం చేస్తుంటాయి. కానీ లోలోపల మాత్రం ఆ పార్టీలు ఒకరిపై ఒకరికి అభిమానం ఉండి మాత్రం కాదు సమయం సందర్భం వచ్చినప్పుడు ఒకరికొకరు అపకారం తలపెట్టే ఆలోచనలతోనే ఉంటాయి. కొన్ని పార్టీల పోకడలను చూసినప్పుడు ఈ న్యాయము వెంటనే మనసులో మెదలక మానదు.
అందుకే సినారె గారు తన ప్రపంచ పదిలో ఇలా అంటారు.
'తోడుగ సాగే నీడను కూడా వాడుకుంటుంది స్వార్థం/ ఆపైవాన్నే పాచిక వేసి వాడుకుంటుంది స్వార్థం/ మనిషిలోని ఆ చీకటి కోణం మార్చే వేషాలెన్నో/ చిటికెడు పేరుకు నీతిని చీల్చివేస్తుంది స్వార్థం/ మూరెడు గద్దెకు జాతి పరువునే ఆరవేస్తుంది స్వార్థం'
ఇలా మనిషిలోని కనబడని చీకటి కోణమైన స్వార్థం... కలిసి ఉన్నట్లు ఉంటూనే సాటి వారికి హాని కలిగిస్తుంది.
కొందరు ఆలుమగలు, స్నేహితులు కూడా ఇలాగే ఉండటం బాధాకరం.వారిలో ఉన్న ఇగోలతో ఎవరికి వారే తమ ఉనికిని చాటుకోవడానికి వీలుపడని పరిస్థితుల్లో కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. కానీ వీరు తిల తండులాల వలె ఉన్నారని అర్థమవుతూనే ఉంటుంది.
అలా కలవని మనసులతో, లోలోపల స్వార్థంతో కలిసి ఉన్నట్లు కనిపించే వారిని ఉద్దేశించి ఈ తిల తండుల న్యాయాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి