హోలీ శుభాకాంక్షలతో...
==================
... *****
శివుని, కవ్వించి... తన కామ ప్రేరిత శక్తితో... లొంగదీసి...
పార్వతీ దేవితో పరిణయ మొనరింప ప్రయత్నించిన ఆ
మదనుని మదమణచి.....
ఆతని రూపుమాపిన వేళ..
కామమును జయించిన... జీవితమున అన్నియూ....
విజయములేనని తెలియజెప్పిన ఆఁ పరమ శివునకు...
దేవతలెల్ల ఆనందాతిశయ హర్షమును ప్రకటించిభక్తిపూర్వ కంగా ప్రణ మిల్లిన శుభ తిధి ఇది యని...
భూలోక వాసులెల్ల.... సప్త వర్ణముల శోభిల్లగ, రంగుల నానందముగా ఒకరిపై నొకరు చల్లుకొనుచు..., మిఠాయిలు
పంచుకుని ఆనందించుదినము
... ఈ హోలీ పండుగ దినము!
బ్రతుకునమనసనుభవించు
అనేకభావనల ప్రతీకయే ఈ రంగుల హోలీ... !
. తెలుపు శాంతము, ఎరుపు రౌద్రము...పసుపు శుభము, కా షాయముత్యాగము,విజయానికి సంకేతము ఈ పైరుపచ్చనిది
ఈ ఆకుపచ్చ.....
ఒక్కో రంగూ ఒక్కో భావనకు
ప్రతీక... !
ఇవియన్నియూ...జీవితమున
మన మనుభ వించక తప్పని వని తెలుసుకొనమని, తెలియ జెప్పుచున్నది ఈహోలీ పండుగ
.. *******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి