పరిమళాల ఉగాది;-డా. నీలం స్వాతి
 చైత్రమాసం చెంత చేరగానే పచ్చదనం పరువాల పైటను ఎగురవేసింది...
లేలేత చిగురులతో, రంగురంగుల పూల కాంతులతో 
పరవశించిన ప్రకృతి 
నిండైన సువాసనలతో
పరిమళించింది...
కోటి కాంతుల కొత్త వేడుకను చూసి
మూగబోయిన కోయిల గొంతున తియ్యని రాగమొకటి
పల్లవించింది...
చుక్కల ముగ్గులు దిద్దిన
వాకిళ్ళలో,
మామిడాకుల తోరణాలు వేలాడగానే తెలుగు వారి ఇంట ఉగాది శోభ మొదలైంది ...
ఆకుపచ్చని ఆశలతో, చుట్టాల,చిన్నారుల చిరునవ్వులతో ఇంటింటా
వేప పూల 
వసంతం విరబూసింది....
భావోద్వేగాలకు ప్రతీకగా షడ్రుచుల సమ్మేళనం...
లాభనష్టాల లెక్కకడుతున్న నూతన పంచాంగం....
కనుల సంద్రంలో రంగుల కెరటాల తాకిడికి
రెట్టింపైన ఉత్సాహం...
పులకించిన మది భావాల
కవితా గానం...
ఆచారాల ఆనవాయితీగా
వ్యక్తీకరించడం మనకు దక్కిన అదృష్టం...
పట్టు కొమ్మలలాంటి
సంస్కృతీ సంప్రదాయాల సౌలభ్యం మనకు మాత్రమే సొంతం...
మనుగడతో ముడిపడిన ప్రతి పండుగ మనకు ప్రత్యేకం...
నాటి తరాల విలువైన వారసత్వాన్ని అందుకుని
విలువలను మరింతగా పెంచడం నేటి తరాల బాధ్యతగా భావిస్తూ...
అందరికీ శ్రీ శోభ కృత్ నామ ఉగాది శుభాకాంక్షలు...

ధన్యవాదాలు
🙏🙏🙏🙏

కామెంట్‌లు