శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ
 గణగౌర్ అనే పండగ కి గౌరీదేవిని  గణేష్ ని పూజిస్తారు.దీన్ని సౌభాగ్య సుందరీవ్రతం అని కూడా అంటారు. చైత్రశుక్ల తృతీయ రోజు మహిళలు భర్త సౌభాగ్యం కోరుతూ చేస్తారు. అవివాహితలకు ఉత్తమ భర్త లభిస్తాడు అని నమ్మకం!రాజస్థాన్ లో ధూంధామ్ గా జరుపుతారు.
గవేషణ అంటే గోవులు అడవిలోతప్పిపోతే శిష్యులు వెతకటానికై బైలుదేరేవారు.ఇలా తప్పిపోయిన ఆవుని వెతకటమే గవేషణ!
రాజపుత్రులలో ఓశాఖగుహిలోత్ లేదా గహలోత్! సూర్యవంశం రాముని కొడుకు కుశుడి పరంపరలో ఆఖరి రాజుపేరు సుమిత్రుడు.ఇతని వారసులలో ఒకడుగుహిలుడు! ఇతనిపేరు మీదగా గుహిల్ వంశం ఏర్పడింది. గుహిలోత గౌహల్య గోహిల గహలోద్ గైలోద్ అనే పేర్లువచ్చాయి.ఆగ్రా సమీపంలో రెండు వేలనాణాలు దొరికాయి.వాటిపై శ్రీగుహిల అని రాయబడింది. 🌷

కామెంట్‌లు