తన ఇంటి అరుగుపైన ఆదివారం కథ వినడానికి చేరిన పిల్లలు అందరికి
మిఠాయిలు పంచిన తాతయ్య 'బాలలు మీఅందరికి ఈరోజు తగని స్నేహం అనేకథ చెపుతాను. ముందుగా మీకు నాలు మంచిమాటలు చెపుతాను. నిస్వార్ధం అనేది మహాన్నతమైన గొప్పలక్షణం. గాలి,వెలుగు ఏంఆశించాయి. రాళ్ళతోకొట్టినా బాధను ఓర్చుకుంటూ తియ్యని ఫలాలను ఇస్తాయి చెట్లు,తను కాలుతూ దీపం వెలుగును ప్రసాదిస్తుంది, అదినిశ్వార్ధతఅంటే! లక్ష్యసాధనలేని జీవితం తెగిన గాలిపటం వంటిది.
దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా నదీప్రవాహం తన లక్ష్యమైన సముద్రాన్ని చేరుతుంది. ఔషదం సేవించేటప్పుడు చేదుగా బాధగా ఉంటుంది.అది సేవించాక ఆరోగ్యం కుదుట పడుతుంది.విద్యకూడా అంతే చదివేసమయంలో బాధగా,కష్టంగా ఉంటుంది ఉత్తీర్ణత సాధించక మన జీవితానికి మంచిభవిష్యత్తును ప్రసాదిస్తుంది.కష్టపడితేనే విజయం సాధించగలం...కథవినండి
కొత్తగా పదవతరగతి చదవడానికి పాఠశాలలో చేరిన రామంతో స్నేహం కుదిరింది శివయ్యకు.రామం బలంగా ఎత్తుగా ఉంటాడు, పాటశాలలో చేరిన వారం రోజులకే మూగ్గురు విద్యార్ధులతో గొడవ పడ్డాడు.శివయ్య ఎత్తుగా ఉన్నప్పటికి బక్కపలుచగా సౌమ్యంగా ఉంటాడు.
పాఠశాల సెలవు దినం రోజున,నాలుగు కిలోమీటర్ల దూరంలోని పక్కఊరిలో తిరునాళ్ళజరగడంతో రామం శివయ్యను పిలుచుకువెళ్ళాడు.అంతదూరం నడచి వెళ్ళడంతో రాత్రి సమయం అయింది.తిరునాళ్ళ జరిగే ఊరికి సమీపంలో,మిత్రులు ఇరువురిని దొంగలు ఆపి డబ్బులు ఉంటే బయటకు తీయండి అన్నారు.సౌమ్యుడైన శివయ్య తనవద్ద ఉన్న డబ్బులు వాళ్ళకు ఇచ్చి మౌనంగా నిలబడ్డాడు. దూకుడు స్వభావం భావం కలిగిన రామం దొంగలపై తిరగబడ్డాడు.దొంగలు రామానికి నాలుగు దెబ్బలువేసి కూర్చోపెట్టారు.
'నన్ను కొట్టడం కాదు మీకుధైర్యముంటే మాశియ్యపైన చేయివేయండి చూద్దాం! మీఅందరిని కలిపి తంతాడు'అన్నాడు రామం.
' నువ్వు అంతటి వీరుడవా?'అని శివయ్యనుకూడా నాలుగు దెబ్బలు వేసి కూర్చోపెట్టి,కొద్దిసేపటికి దొంగలు వెళ్ళిపోయిరు.
'ఏమిటి నిన్నుకూడా దొంగలచేత తన్నించానని ఆలోచిస్తున్నావా? నాకు మాత్రమే దెబ్బలు పడితే రేపు పాఠశాలలో అందరికి చెపుతావు అందుకని నీకు దెబ్బలు పడేలా చేసా ఇప్పుడు నువ్వు దొంగలు నన్ను కొట్టారని ఎవ్వరికి చెప్పలేవు,ఎందుకంటే దొంగలు నిన్నుకొట్టారుకనుక ఎలా ఉంది నాతెలివి'అన్నాడు.
అతని మాటలకు ఆశ్చర్యపోయిన శివయ్య రామం వంటి వారితో స్నేహం తగదు అని అనుభవపూర్వకంగా తెలుసు కున్నాడు.
కథవిన్నారుగా బంధువులతో,తల్లితండ్రులతో చెప్పుకోలేని బాధను స్నేహితునితో పంచుకుంటాము.తేనె కన్నాతీయనిది, మంచుకన్నా చల్లనిది స్నేహం. మంచిస్నేహితులతో సహవాసంచేయండి వారితోకలసి ఉమ్మడిగా చదవండి మీజీవితంలో ఉన్నతశిఖరాలు అధిరోహించండి అన్నాడు'తాతయ్య.
.
తగని స్నేహం.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి