ఆదరణ;- కొప్పరపు తాయారు
ఆదరించే చేయి, అవ్వయినా
బామ్మ అయినా, అమ్మ మనసే,
అమ్మ భోజనం కడుపారా అందించు
ప్రేమామృతాలతో అపరంజి బొమ్మలా!

    
ఆదరణతో పాటు దరహాసం తో
ఆత్మీయతలన్నీ కలిపి రంగరించి
తానువండినవంటకంతయారుగా
తనవారు తనకైన వారు అందరికీ,!

మిక్కిలి మమతానురాగాల అందించ
భుజించిన వారి అదృష్టం ఏమని
 చెప్పనుఅందుకే అమ్మ నీ మోము లోని దరహాసం
శాశ్వతం నీ అనురాగం అనంతం !!
వారు వీరని లేని ఉన్నతమైన స్వార్థరహితమైన 
మనసు అందిస్తావు ప్రతీతినుబండారం 
ప్రేమతఅర్పించుకుంటావు   
ధన్య హో స్త్రీ మూర్తి ఓ అమ్మా !!!

నీ రూపం దైవం నీ భావన 
అపురూప నీవు  దైవ స్వరూపానివి ప్రాణమిస్తావు
ప్రాణం పెడతావు  ‌.          
నీ చేత అమృతం నీ హృదయం అమృత భాండం !!

అమ్మా అని ఒక పిలుపుకే కదిలి పోతావు 
ఓ ప్రత్యక్ష దైవమా, మెదలే మహనీయ
మంత్రమా, నీ అండదండలు మాకు
జీవితాంతం తోడు నీడే కదమ్మా !!!

కామెంట్‌లు