ఉగాది వచ్చెను జగాలు పండ
ఆనందోత్సాహాలు నిండ
అందరి హృదయాలు
ఆనంద అల్లరుల తేల !!!
అవని పులకించె తిరుగులేని
తన్మయత్వాలతో, సంపదలతో,
కారుణ్యమూర్తి ధరణీ మాత
ఒడలెల్ల పులకించ పక పకా
నవ్వె ,ఆ నవ్వుల వెలుగుల
ప్రకృతి ప్రకాశించే పరిమళించే
దివ్యమైన అనుభూతులతో
అందరికీ ఈ పండుగ అందెనండి
ఈరోజు ఆనందాలు పంచ గా
ఉగాది. అంటే ఉరకలతో
గతి తప్పక దిగ్ దిగంతాలు
దివ్య వెలుగుల ప్రజ్వరిల్ల
బ్రతికి జూప సందేశమివ్వ
వచ్చెనండి ఉగాది సకల
శుభాలతో శోభకృత్
నామ సంవత్సరం ఆ వాక్కు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి