ప్రతి మనిషికి సామాన్యంగా కావలసిన మొదటి అవసరం మానాన్ని కాపాడుకోవడం దానికోసం ఆర్థిక స్తోమతను బట్టి గోచితో ప్రారంభించి కోటు, బూటు, సూటు వరకు వెళ్లే వ్యక్తులను మనం గమనిస్తూనే ఉంటాం ఎలాంటి వేషం వేసినా దాని వెనుక ఉన్న విషయం మాత్రం సిగ్గును దాయడం మామూలు వ్యవసాయదారులు ధరించే వస్త్రాలకు ఉద్యోగం చేస్తూ ఆఫీసులకు వెళ్లేవారు ధరించే బట్టలకు విలాసవంతమైన వారి జీవితంలో ధరించే దుస్తులకు చాలా భేదం ఉంటుంది అసలు ఈ వస్త్రాలు దేనికి మన శాస్త్ర ప్రకారం బోడి గుండు చేయించుకున్న వాడు ముండ విద్యార్థి అని సగం బోడిగుండు వాడు ప్రచారకుడని గోవు పాదమంత పిలక పెట్టుకున్న వారిని ఉపాధ్యాయుడని మనం చెప్పుకుంటాం వస్త్రధారణను చూసి వారు ఏ ఏ పనులకు నియోగించబడ్డారు అన్న విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించగలం ఇవాళ ప్రపంచం మొత్తం వ్యాపారాత్మకంగా మారిపోయింది చివరకు వేదాంతం కూడా కాషాయం ధరించి గడ్డాలు మీసాలు జుట్టు పెంచి విభూది రాసి ఒక చిన్న కర్రగాని లేదా కమండలం కానీ చేతిలో పట్టుకొని సమాజానికి హితాన్ని చెప్పడానికి వచ్చే వ్యక్తులుగా కనిపించే కొంతమంది దొంగ సన్యాసులను గురించి వేమన చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు వారి భుక్తి గడవడం కోసం తన శిష్య బృందానికి అవసరాలను తీర్చడం కోసం తన శిష్య బృందం దగ్గర ఎక్కువగా ఆడవారి దగ్గర ధనాన్ని సేకరించి మూల ధనం మూలిగేలాగా ఏర్పాటు చేసుకోవడం వారికి నిత్య కృత్యం. తలలు బోడులు చేయించుకొని జంద్యం ధరించి ఒంటినిండా విభూది పూసి ఉపన్యాసాలు ఇచ్చి ఆసనాలు వేసి దానికి తగిన వేషం ధరించిన యోగి లాగా కనిపిస్తాడే తప్ప అతను యోగి కాదు దొంగయోగి అని చెబుతున్నాడు వేమన నిజమైన యోగి అరిషడ్వర్గాలను వదిలివేసి ఏకాంతంగా తపస్ సమాధికి వెళతాడే తప్ప ఇలాంటి వేషాలు వేయడు కదా మరి ఇలాంటివి ఎందుకు వేస్తున్నారు ధనార్జన కోసం తప్ప మరొక పరమార్ధం ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు వేమన అసలు యోగి యోగిగా ఉండాలంటే అతనికి కావలసింది హృదయం మంచి హృదయం ఎవరికి ఉంటుందో వారే యోగి తప్ప ప్రతి ఒక్కడు యోగి కాలేదు అన్నది వేమన సిద్ధాంతం ఆయన రాసిన పద్యం చదివితే ఆ దొంగతనం బయటపడుతుంది చదవండి మరి.
"బోడి తలలు జడలు బూడిదె పూతలా భాషణాసనములు వేషములను యోగి గాడు లోన బాగు గాకుండెనా..."
"బోడి తలలు జడలు బూడిదె పూతలా భాషణాసనములు వేషములను యోగి గాడు లోన బాగు గాకుండెనా..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి