ఈ ప్రపంచంలో మనిషి తో పాటు ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ప్రాణి క్రిమి కీటకాదులతో సహా తమకు నిర్దేశించిన సమయాన్ని పూర్తిగా వాడుకొని ఆ తర్వాత తమ శరీరాన్ని వదిలి వేయడం మనం నిత్యం ప్రత్యక్షంగా చూస్తున్న విషయం పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు అన్నది శాస్త్రం మరి మరణించేంతవరకు ఏమిటి చేస్తాడు పుట్టిన మరుక్షణమే మరణాన్ని ఆహ్వానించి శరీరానికి మంగళం పాడేస్తాడా లేక ఇంకా ఏమైనా వేరే పరమార్థం ఏమైనా ఉన్నదా అన్నది ఆలోచించే వ్యక్తులు ఎంత మంది ఉన్నారు మన పెద్ద వారు అంటూ ఉంటారు మరణించే ముందు జీవించాలని ఆ జీవించడం ఎలాగో తెలుసునా జీవించేది నీవా ఆ జీవా నీకు అర్థం అవుతుందా. ఈ శరీరంలో ఏ భాగం ఈ శక్తిని ఇస్తుందో నీకు తెలుసా నీవు వింటున్నావ్ చూస్తున్నావు మాట్లాడుతున్నావ్ స్పర్శను అనుభవిస్తున్నావు ఇవన్నీ నీ తనువు చేసే పనులా ఇంకెవరైనా చేయిస్తున్నారా దానికి మూలం ఎవరు మనకు కనిపించని భగవంతుడా మరి ఏదైనా పదార్థం ఉన్నదా ఒక్కసారి ఆలోచించు ఇది జీవితం జీవి తనువుతో ఏర్పడినది ఈ తనువును ఆడించేది జీవి తనువు కాదు అన్న విషయం ముందు స్పష్టంగా తెలుసుకో ఆ తరువాత ఆ జీవి ఎవరో అది ఎలా వచ్చింది ఏం చేస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయాలను గురించి తర్జన భర్జనలు చేసి ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం చెయ్.
నిజమైన జీవితాన్ని నీవు గడపాలి అంటే మంచివాడిగా ఉండాలా చెడ్డవాడిగా ఉండాలా అన్నది ముందు నిర్ణయించుకో నీవు మరణించిన తర్వాత వీడు చనిపోయాడు సగం పీడ వదిలింది అనిపించుకునేలా జీవిస్తావా నీవు మరణించిన తర్వాత కూడా జీవించడానికి ఏర్పాటు చేసుకొని ఉంటే వీడు ఆదర్శంగా జీవించాడు అని పెద్దలు నీకు తెలిసిన వారు అనుకుంటారు అందుకు నీవు జీవించాలి సమాజానికి నీకు చేతనైనంత మంచి చేయడానికి ప్రయత్నం చెయ్ అక్షరాలు రాని వాడికి అక్షరాలు దిద్దించు ఆకలి అయిన వాడికి అన్నం పెట్టు అవసరమైన వారికి మాట సాయమైనా చెయ్ అప్పుడు జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో తెలుస్తుంది భౌతిక మైన నీ శరీరాన్ని ఈ సమాజం నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటుంది అని మర్చిపోకు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి