గజేంద్ర మోక్షం (34 నుండి 38 )
-------------------------------------------
స్నానమాడు చుందురు
సంతషించుచుందురు
ఈ కొలనున చేరుకొని
దేవకన్యలందరు
వారి సువాసనల సొంపు
విరజమ్మగ గుబాళింపు
వనమంతా సుందరం
సుగంధాల మేళవింపు
అంత గొప్ప సరసున
హరి చందన జాడన
మకరేంద్రుడి గజేంద్రుడి
యుద్ధము కొన సాగెన
త్రికూట గొప్ప పర్వతము
చక్కని ఉధ్యాన వనము
కనీవినీ ఎరుగనట్టి
చెట్ల పొదల ప్రాణదనము
కొన్ని చిరు పర్వతాలు
రకరకాల జంతువులు
కూటమి అలరారునట్లు
విచిత్ర చిత్ర పక్షులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి