గజేంద్ర మోక్షం (51 నుండి 56 )
-------------------------------------------
బలమైన గజేంద్రుండు
పట్టు విడని మకరుండు
వీరిరువురి పెనుగులాట
చూసెడి ఏనుగుల దండు
బంధువులు బలగాలు
భార్యలు మరి బిడ్డలు
గట్టుమీద దుఃఖించుచు
గడిపిరి వత్సరములు
మకరి నీటినకు లాగ
గట్టునకేనుగు లాగ
దేనిబలము దానిదే
రణంబు ముగియదెలాగ
ఎన్నో రాత్రులు గడిచెను
మాసములెన్నో గడిచెను
భార్యలు భుక్తిని బెట్ట
సంవత్సరములు గడిచెను
ఒకరికి మించింకొకరు
చాకచక్యమున పోరు
ఏనుగు నెత్తురు ద్రావుచు
తగ్గని మకరము జోరు
ఏండ్ల కేండ్లు గడచుచుండె
నీటి బలము మొసలికుండె
గట్టున బ్రతికే ఏనుగు
జలమున క్షీణించుచుండె
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి