ఈమె తాడిపల్లిగూడెం దగ్గరలోని పెంటపాడులో 1926/జనవరి/3 వ తేదిన కందాళ తాతాచారి,రామకోటమ్మ దంపతులకు జన్మించారు. ప్రాధమిక విద్య మాత్రమే పూర్తిచేసినీ ఈమె అసలు పేరు వెంకట పుష్పవల్లి తాయారు.తమకుటుంబ సన్నిహితులు అచ్యుతరామయ్యగారి ప్రోత్సాహంతో పన్నెండవ ఏటనే మొదటి సారి ' సంపూర్ణ రామాయం ' (1936) చిత్రంలో సీతవేషం వేసారు. అనంతరం ' దశావతారములు ' (1937)చిత్రంలో మోహిని,మాయశశిరేఖ,శూర్పణఖ పాత్రలు,
' విశ్వమోహినీ ' (1940) ' వింధ్యారిణి ' (1948)లో వింధ్యారాణిగా,
' చెంచులక్ష్మి' (1943)లో లీలావతిగా, ' చూడామణి ' (1941) ' పాదుకా పట్టాభిషేకం ' (1945) ' చల్ మోహనరంగా ' ' మోహిని భస్మాసుర ' (1938) లో మోహినీగా,' మాలతీ మాధవం' (1940) ' సత్యభామ ' (1942) ' బాలనాగమ్మ' (1942)చిత్రంలో సంగుగా, (1942)
' సుడిగుండాలు ' (1968) ' బందిపోటు ' (1963)లో నందమూరి తల్లిగా,' అమరశిల్పి జక్కన్న'(1964) లో రాణి శాంతలాదేవిగా,
' భూలోకంలో-యమలోకం ' (1966) ' ప్రతిజ్ఞాపాలన ' (1965)
' తారాశశంకం ' (1941) లో తారగా, ' భక్తమార్కండేయ ' (1956)వంటి పలు చిత్రాలలో పాత్రలు ధరించారు.అలా జెమినీ సంస్ధలో నెలకు రెండు వందల రూపాయల జీతంపై పద్దెనిమిదేళ్ళు ఆసంస్ధ నిర్మించిన తమిళ, తెలుగు ,హిందీ సినిమాలలో నటించారు. ' పెంపుడుకొడుకు ' చిత్రంలోనూ, అలానే ' వరవిక్రయం ' లో కమలగా నటించారు.
ఈమె చెల్లెలు సూర్యప్రభ (నటి శుభ తల్లి) కూడా సినిమా నటే పలు చిత్రాలలో నటించి, దర్శకుడు వేదాంతం రాఘవయ్యగారిని వివాహం చేసుకుంది.
పుష్పవల్లి తన భర్త రంగాచారికి దూరంగా ఉంటూ నటుడు జెమినీగణేషన్ కుచేరువ అయింది.బాబ్జి,రమా,రాధ,ధనలక్ష్శి,భానురేఖ (హిందీ నటి)అనే సంతానం కలిగింది.నటి సావిత్రితో జెమినీకి వివాహం కావడంతో ఆయనకు దూరంగా ఉండిపోయింది.
కథానాయకి నుండి తల్లిపాత్రల వరకు అన్ని పాత్రలు పోషించి నవరసాలు పండిన ఈమె 1992/ మే/11 వతేదిన స్వర్గస్తులైనారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి