నదీకన్య కాలి అందెల
గలగల సవ్వడులు
సాగరు పాదాల సన్నిధి
కోరి వడివడి నడకలు
పల్లం వైపు ప్రవాహం
అలుపులేని పయనం
మజిలీలు మలుపులు
వాగు వంకలతో స్నేహం
చిన్ని అలల గుసగుసలు
ఇరు గట్లతో కుశలభాషణలు
చెట్టూ పుట్టలతో మాటా మంతీ
పైరుపంటలకు పంచే జలసిరులు
ఒడ్డున విరిసే పువ్వుల అందం
నదిలో కదిలో నావల గమనం
తెడ్డును వేస్తూ సరంగు గానం
మోసుకొచ్చే మలయసమీరం
మౌనంగా గమనిస్తూ
ఆలోచనలో చర్చిస్తూ
మనసుతో యోచిస్తూ
విచక్షణతో నడుస్తూ
ఏది ఎలా వస్తే అలా
అన్నిటినీ కలుపుకుని పోతే
మనసుకు ప్రశాంతత
బ్రతుకునకు సార్థకత
మంచివేపు నడిపించే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి