కొత్తగ విరిసే వెలుగుపువ్వు
గుండెల్లో లోతుల్లో
మెత్తగ తెచ్చెను చిన్నినవ్వు
వెలుగుల దారాలతో
జిలుగుల చీరనేసి
చెలువార చెలిమితో
కలికి ధరణి మేన సింగారింప
పరుగుపరుగున
మేఘమాలల దాటుతూ
చెంగుచెంగున తుళ్ళుతూ
గిరుల వరుసలు తాకుతూ
కినుకగా చూసే కొండవాగులకు
కానుకగా కాసిన్ని మెరుపులందించి
కిలకిలా నవ్విన జలములకు
ముదమార ముసిముసిగ ముద్దుపెట్టి
మరకతమ్ముల మధ్య
మాణిక్యములు దాచి
కులుకులొలుకు సిరుల
పంటచేలకు పసిడి వన్నెలద్ది
ఇలను చేర... కలలు తీరగ
కనుల పండువగా
కరములు జోడించి
కళ్ళ జ్యోతుల హారతి పట్టె ధరణి
కమనీయమైన వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
[10:57 am, 31/07/2023] Vedanta Sury: https://www.molakanews.page/2023/07/blog-post_958.html?m=1
[12:31 am, 1/08/2023] brundamani: ధన్యవాదాలు సర్🙏💐
[1:32 am, 2/08/2023] brundamani: కొండమల్లెపూలతో
కోనంతా నిండుగా
కొనితెచ్చెనంట పండుగ
కొండల నడుమ పుట్టిన
కోటి వెలుగుల దీపం
నిన్నటి కలతలు మాపి
రేపటి కలల తీపి
ఈనాడే పంచివ్వగా
ఉదయించెను తూరుపున
గతమంతా మరపించగ
చెలిమితో చేరువ చేసి
వెలుగుల తీరం
కరువులన్నీ తీరాలని
కమ్మటి క్షణాలు కానుకగా
కలిమిలా ఇవ్వాలని..
వేదనలు వెలికి పంపి
వేడుకగా మనసు నిండి
రెప్పదాచిన స్వప్నాల
కుప్పగా ముంగిటపోసి
మురిపాల తేలించాలని....
కనుచూపులు పరచుకుని
పెనుకోరిక పెంచుకుని
మునివేళ్ళపై నిలబడి
ఎదురుచూచు పువ్వులకు
నవ్వులద్దాలని....
ఆగమించు ఆప్తమిత్రుని
ఆశతీర స్వాగతించి
ఆప్యాయంగా కౌగలించి
ఆత్మీయపు స్పర్శతో
పులకరిస్తూ పుడమి పాడే
🌸🌸 సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
[10:55 am, 3/08/2023] Vedanta Sury: https://www.molakanews.page/2023/08/blog-post_70.html?m=1
[12:35 pm, 3/08/2023] brundamani: ధన్యవాదాలు సర్💐🙏
[12:28 am, 5/08/2023] brundamani: తిమిరాన్ని హరించే
కాంతిపుంజపు వెలుగులు
వసుధను ఆవరించి
కొత్తజీవం పోయగా....
కన్నీటి కథలన్నిటినీ
కమ్మగా మరపించి
కన్నుల్లో వెన్నెల్లు పూయించు
మత్తుమందు నేదో చల్లగా....
మోయలేని హాయినంత
మోములోనే మెరిసేలా
మురిపించే భావాలను
మరీ మరీ తెలిపేంతగా...
ఆగమించు విభుని
అడుగులను తాకగా
ఆనురాగమంత పూలై
రహదారినంత నింపేస్తూ...
పచ్చికను హత్తుకునే
పసిడికాంతులను
పచ్చని సుమశ్రేణి పలుకరింప పులకించు పుడమికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
[11:09 am, 5/08/2023] Vedanta Sury: https://www.molakanews.page/2023/08/blog-post_48.html?m=1
[11:19 am, 5/08/2023] brundamani: ధన్యవాదాలు సర్💐🙏
[12:39 am, 6/08/2023] brundamani: అంతరంగాన కలిగిన
వేదనకు ఓదార్పులా
నీరవ నిశీధిలో కలిగే నిర్లిప్త
నిట్టూర్పుకు ఉత్సాహం లా
ఆలోచనల అలజడిలో
అలసిన మనసుకు చేయూతలా
దారీ తెన్నూ తెలియక
దిక్కుతోచని వేళ దొరికే తోడులా
శూన్యమైన వేణువులో
రాగం పలికించే మారుతంలా
ఆవిరైన ఆశల కుదుళ్ళకు
అందిన జలస్పర్శలా
వేదనలో వెలితిని తరిమేసి
అక్కున చేర్చుకునే ఆత్మీయతలా
ఓర్పుకు ఫలమై దొరికే
మార్పును తెచ్చే తూర్పుకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
[10:39 am, 6/08/2023] Vedanta Sury: https://www.molakanews.page/2023/08/blog-post_639.html?m=1
[10:47 am, 6/08/2023] brundamani: ధన్యవాదాలు సర్💐🙏
[12:34 am, 7/08/2023] brundamani: కనకవేదిక మీద కచేరీగా
మయూఖ తంత్రుల పైన
తొలిసంధ్యారాగం పాడే
అపరంజి వెలుగులకు....
మనసులోని మర్మమంతా
తెలుసుకొని తెరిపినిచ్చే
కరుణ నిండిన స్పర్శతో
కనికరించే కలిమికి
ఎదలోతున దాగి ఉన్న
ఎన్నెన్నో గాధలను
గురుతు తెచ్చి మురిపించే
గుండెనింపే పండుగకు....
చెలిమి పండి పంచిన
నెత్తావిమాధురులు
కొమ్మలుగా విస్తరించి
మనసంతా నింపిన హాయికి
అనుభూతుల పరిష్వంగంలో
అమృతంగా మారిన అంతరంగం
అనుభవించే ఆనందపు
అద్భుతమైన అనుభవాలకు
ఎన్నడు ఎరుగని కలలన్నీ
కన్నులముందర నిలబెట్టి
కుంభవృష్టిగా కరుణను
గుమ్మరించే ప్రత్యక్ష దైవానికి...
🌸🌸 సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
[11:05 am, 7/08/2023] Vedanta Sury: https://www.molakanews.page/2023/08/blog-post_928.html?m=1
[11:31 am, 7/08/2023] brundamani: ధన్యవాదాలు సర్💐🙏
[1:10 am, 8/08/2023] brundamani: తూరుపు గుమ్మాన
అడ్డుగా నిలిచి రానివ్వక
మేలమాడు పాలమబ్బుల
ముసిముసి నవ్వులతో తోసి....
గిరుల స్వాగతాలు
ఝరుల సంగీతాలు
తరూశాఖల వింజామరలు
విరుల గంధాలు అందుకుని
పచ్చిక పరచిన
మరకత రత్నకంబళి
ముచ్చట తీరగా పంచు
అచ్చమైన ఆత్మీయత పొంది
నునులేత కిరణాల
నులివెచ్చని స్పర్శతో
తెలిమంచు కరుగగా
తెల్లని వెలుగులు పంచుతూ
అరుదెంచు ఆప్తమిత్రునికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి