సునంద భాషితం ;- వురిమళ్ళ సునంద, ఖమ్మం
 న్యాయాలు -267
వేతస న్యాయము
*****
వేతసము అంటే వానీరము,ప్రబ్బలి చెట్టు,నదుల ఒడ్డున పెరిగే ఒక రకమైన చెట్టు.
ఈ ప్రబ్బలి చెట్టు యేరు లేదా నదిని ఆనుకుని ఒడ్డున  పెరుగుతుంది. అలలు, వరదలు వచ్చినప్పుడు వంగుతుంది. అవి తగ్గగానే లేచి తలెత్తుకుంటుంది.
 ఈ వేతస న్యాయములోని అంతరార్థాన్ని సూక్ష్మంగా పరిశీలించి  మన పెద్దలు యుక్తి గల మానవులకు అన్వయించి, అలా  ఉండాలని చెప్పారు.
కొందరు బుద్ధిమంతులు, యుక్తి కలిగిన వారు శత్రువులు తమ కంటే బలమైన వారయినప్పుడు వారి యొక్క దుష్టత్వాన్నీ, ఆధిపత్యాన్ని  ఎదిరించలేక వినమ్రులై తలయొగ్గుతూ వారి బారిన పడకుండా తమ జీవితాన్ని గడుపుతుంటారనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ఈ ప్రబ్బలి చెట్టును  స్త్రీల శరీర సౌకుమార్యానికి గుర్తుగా చెప్పడం విశేషం .తిరుప్పావై పాశురాలలో పదిహేడవ పాశురంలో యశోదను వర్ణిస్తూ "ప్రబ్బలి చెట్టు వంటి సుకుమారమైన స్త్రీలలో చిగురు వంటి దానా మేలుకో ! "అంటూ గోపికలు మేల్కొలుపు పాడుతారు.
 అదే విధంగా ఈ ప్రబ్బలి చెట్టు పూల గురించి పాల్కురికి సోమనాథుడు బండారి బసవన్న గురించి రాసిన ద్విపద కావ్యంలో ప్రస్తావిస్తాడు. "తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ప్రబ్బలి పూల కోసం పరుగులు తీస్తుందా? అంటూ శివభక్తుడైన బండారు బసవన్న గొప్పతనాన్ని అందులో తెలిపాడు.
ఇవే కాకుండా  కిరాతార్జునీయం రాసిన భారవి గారు  'ఆరవ సర్గలో'  ప్రబ్బలి చెట్ల గురించి ఎంత గొప్పగా వర్ణించారో చూడండి."ఎత్తైన దేవదారు వృక్షాలను సైతం కూల్చగలిగే వేగంతో పారే గంగానదిలో నీటి ప్రబ్బలి చెట్ల సమూహం ప్రణామం చేస్తున్నట్లు అనిపించాయి.ప్రవాహ వేగానికి వంగుతూ, వేగం తగ్గగానే నిటారుగా లేచి నిలబడటం  చూస్తుంటే అవి ఎంతో వినయవంతుల్లా  అనిపించాయి." అంటారు.
 ఇలా  అనేక సందర్భాల్లో, కావ్యాల్లో ప్రస్తావించబడిన ప్రబ్బలి చెట్ల గురించి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే అంత సున్నితమైన చెట్లు కూడా  వరదనీటికి ఎదురీదుతూ వాటి మనుగడను ఏ విధంగా కొనసాగిస్తున్నాయో మనుషులు కూడా అదే విధంగా అలాంటి పరిస్థితులను అధిగమించాలనీ చెప్పడం.అంతే కాకుండా అలా గడిపేవారిని ఉదహరించడం  ఈ "వేతస న్యాయము" ద్వారా మనం గమనించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
nawadawana - 179 gugul+ చెప్పారు…
thank u madom, ఎన్నో valuable విశేషాలను చెప్పారు, & ఇటువంటి మంచి అంశాలను -
రథాభ్రపుష్ప - విదుల* - శీత - వానీర, వఞ్జులాః||
*a] విదుల ; b] విదుళ ;;
భావము ;- + వేతి అంభో ఽనువర్తతేవేతసః ::
ద్వితీయ కాండమ్ - అమరకోశం ;- వనౌషధి వర్గం ;- లో శ్లోక రూపాలలో అమరసిం హ - ప్రజలకు అద్భుతంగా
అందించారు
nawadawana - 179 gugul+ చెప్పారు…
thank u madom, ఎన్నో valuable విశేషాలను చెప్పారు, & ఇటువంటి మంచి అంశాలను -
రథాభ్రపుష్ప - విదుల* - శీత - వానీర, వఞ్జులాః||
*a] విదుల ; b] విదుళ ;;
భావము ;- + వేతి అంభో ఽనువర్తతేవేతసః ::
ద్వితీయ కాండమ్ - అమరకోశం ;- వనౌషధి వర్గం ;- లో శ్లోక రూపాలలో అమరసిం హ - ప్రజలకు అద్భుతంగా
అందించారు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం