వెన్నెల -సాగరం ;- ఎం. వి. ఉమాదేవి.
 (ఉత్పలమాల )
----------------------
పున్నమి కాంతులెల్లడల పూచిన మల్లెలతీరు హాయిగా
సన్నగ మేని కందుచును సాగర తీరమె పొంగు నంబువుల్
మిన్నగ నూహలన్ చెలగి మేలగు కావ్యము వ్రాయగోరుచున్
చిన్నదిగోరె వల్లభుని చిక్కని భావపు కైత కాన్కగా!!

కామెంట్‌లు