శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )- ఎం. వి. ఉమాదేవి
191)హంసః -

నేనుతానే అయినట్టివాడు
యోగి విశేషమై యున్నవాడు
తనలోనే నేనున్నట్టి వాడు
స్వామియై రక్షించగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
192)సుపర్ణః -

అందమైన రెక్కలున్నట్టివాడు
తామరతీగలాయుండువాడు
పక్షిరాజయినట్టి గరుత్మంతుడు 
పాలపిట్టవలే అందమైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
193)భుజగోత్తమః -

భుజంగాలలో శ్రేష్ఠుడైనవాడు
సర్పసమూహం నాయకుడైనవాడు
సుగుణమణి యైనట్టివాడు
సర్పశ్రేణియే గొలుచుచున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
194)హిరణ్యగర్భః -

బంగారపు బొడ్డుగలవాడు 
తామర నాభియందున్నవాడు 
బ్రహ్మకు పుట్టుకనిచ్చినవాడు 
సర్వోత్తమమైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
195)సుతపాః -

చక్కగా తపస్సుజేయునట్టివాడు
ధ్యానమగ్నుడై యుండెడివాడు
తపోధనుడై భాసిల్లువాడు
తాపసుల మార్గదర్శియైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు