ఘంటసాల పాటల విజేతగా తిరుమలరావు

 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు పాటల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. 
ఘంటసాల ఏభయ్యో వర్ధంతి సందర్భంగా, విజయనగరం జిల్లా రాజాంలో స్వరనీరాజనం పేరిట నిర్వహించిన ఉత్తరాంధ్ర స్థాయి పాటల పోటీల్లో ఆయన పాల్గొని ద్వితీయ బహుమతి పొందారు. 
రాజాం ఘంటసాల సంగీత కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు మంతపూడి ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో ఇరవైమందికి పైబడి పాల్గొనగా, అందులో 
ఆరుగురు విజేతలుగా ఎంపికైరి. న్యాయనిర్ణేతలుగా రాజాం కళాసాగర్ అధ్యక్షులు మెట్ట దామోదరరావు, ప్రముఖ గాయకులు బి.మల్లేశ్వరరావులు వ్యవహరించారు. పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే అనే పాటను తిరుమలరావు ఆలపించి ద్వితీయ స్థానాన్ని సాధించారు. 
ముఖ్య అతిథి పద్మశ్రీ యడ్ల గోపాలరావు, సభాధ్యక్షులు మంతపూడి ప్రసాదరావు, విశిష్ట అతిథి కొత్తా సాయి ప్రశాంత్ కుమార్, గౌరవ అతిథి బి.వి.అచ్యుతరావు, ప్రత్యేక ఆహ్వానితులు బలివాడ శ్రీనివాసరావు, టీవీ కళాకారులు మల్లాన ఆదియ్య, కామేశ్వరరావు, పంచముఖేశ్వరరావు తదితరుల చేతులమీదుగా తిరుమలరావుకు బహుమతి ప్రధానం జరిగింది.
తిరుమలరావు ఘంటసాల పాటల విజేతగా నిలిచి బహుమతి పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు