*పేదరికానికి చింతించవద్దు* ;- డా.వాసరవేణి పరశురాం,బాలసాహిత్య రచయిత, , సింగారం, రాజన్న సిరిసిల్ల, సెల్:9492193437
 నాగారం గ్రామంలో శివయ్య ఉన్నాడు. ఆయన భార్య గౌరి. వీరికి గణేష్ అనే కొడుకు ఉన్నాడు. వీరిది రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబం. అలాగే  ఉత్తమ కుటుంబం.శివయ్య, గౌరీలు రోజు కైకిలి పోతారు. కూలీ దొరుకకపోతే ఆరోజు వారింట్లో  పూట గడువదు. గణేష్ 2వ తరగతి చదువుతున్నాడు. బడిలో  బ్యాగ్ కూడా  లేదనీ తోటివారు గణేషుని వెక్కిరిస్తారు.ఇంటికి వచ్చి తల్లితో చెబుతాడు. గౌరీ నేను కూలీ పోయి పైసలు తెచ్చినంక బ్యాగు కొనిస్తానంటుంది. బుదరకించి తెల్లవారి బడికి పంపుతుంది. తన కుటుంబం పేదరికానికి బాధపడి మళ్ళీ  ధైర్యం తెచ్చుకుంటుంది. 
      ఒకరోజు బడిలో తోటి విద్యార్థులు గణేషును గేలి చేస్తారు. చినిగిన పాత బట్టలు వేసుకున్నాడనీ నవ్వతూ అవమానిస్తారు. గణేష్ బిగ్గరగా ఏడుస్తాడు. 
      ఇంటికి వచ్చిన గణేష్ ఏడుస్తూ మూలన కూర్చుంటాడు. శివయ్య ఏమైందిరా అని అడుగుతాడు.  గణేష్ ఏంగాలేదుపో అని ఏడుస్తూ అంటాడు. తల్లి గౌరీ గణేష్ దగ్గరకు వచ్చి  ఏడువద్దు నాయనా అంటుంది. ఎందుకు ఏడుస్తున్నావనీ అడుగుతుంది.గణేష్ దుఃఖంతో  నన్ను బడిలో బట్టలు చినిగినవనీ ఎక్కిరిస్తున్నారు అంటాడు. బుక్కులు, పెన్నులు,చెప్పులు సరిగా ఉండవనీ హేలన చేస్తున్నారు. నేను బడికి  పోను అంటాడు గణేష్. 
      తల్లి గౌరీకీ దుఃఖం వస్తుంది. గణేషుని తన ఒళ్ళోకి తీసుకుని ఏడుస్తుంది. కానీ ధైర్యం తెచ్చుకుంటుంది. నాయనా గణేష్ ఎవరో అన్నారనీ, గేలి చేశారని బాధపడవద్దు. మనము పేదవారమనీ చింతించవద్దు. ఆత్మగౌరవం కలిగి ఉండాలి. ఆత్మస్థైర్యం కలిగి ఉండాలి.బాధపడుతూ కూర్చోవద్దు. నువు చక్కగా చదువుకో , కష్టపడి ఇష్టపడి చదువుకో.భవిష్యత్తులో నీవు అనుకున్నది సాధిస్తావు.నిన్ను వెక్కిరించినవారే నిన్ను మెచ్చుకుంటారు. కలెక్టర్  కూడా కావచ్చు. ఉన్నతంగా బతుకుచ్చు . మనలాంటి  పేదలకు సేవలందించవచ్చు. ఇప్పుడు పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు కష్టపడి పైకి వచ్చినవారే.అని ఓదారుస్తూ చెబుతుంది. 
      గణేష్ తల్లి గౌరీ చెప్పిన మాటలకు ప్రేరణ పొందుతాడు.  అప్పటినుండి ఆత్మగౌరవంతో మెదులుతాడు.ఎవరు వెక్కి రచించినా పట్టించుకోడు. కలెక్టర్ కావాలని కలలు కంటాడు.  వినయ విధేయతలతో మెదులుతాడు.గురువులను, తల్లిదండ్రులను,పెద్దలను గౌరవిస్తాడు. చక్కగా చదువుకుని కలెక్టర్ అవుతాడు. తనలాంటి కుటుంబాలకు చదువు నందిస్తాడు. పేదలకు, సమాజానికి సేవలందించి అందరి మెప్పు పొందుతాడు.ఆదర్శంగా జీవిస్తాడు. అమ్మా నాన్నలను చక్కగా చూసుకుంటాడు.
    

కామెంట్‌లు