పాడవే కోయిలా! -"పాడె" గీతికలనిక
పాడు మనుజులను కా-పాడె చట్టములకున్;మధురమా! క్రోధిలో మధుమేహమును పెంచిమదకీచకుల నణచి మట్టుబెట్టవె రేగి;లవణమా! క్రోధిలో లాలూచి నాయకులగుండెపోటుల బెంచి గుణపాఠమివ్వవే;తిక్తమా! క్రోధిలో తెగ రెచ్చిపోయి నీచేదుతో నిజములను చెప్పించి చెరబెట్టు;కారమా! క్రోధిలో కఠినవైఖరి బూనిగర్వాంధకారులను గద్దెనెక్కించకే;అమ్లమా! క్రోధిలో నల్సరుల బుట్టించిదోచి దాచిన దుష్ట నీచులను కడదేర్చు;వగరుదనమా! క్రోధి బొగరుబోతుల పీచమణచి మరి రాకుండ యడ్డగించవె యెప్డు;రుచులార! పేట్రేగి ఉచిత పథకాలతోఊరించు నీచులను ఉరికించి తరుమండి;చైత్రమా! క్రోధిలో శరమించుకను లేకరంగురంగులు మార్చు రణభీరువుల గూల్చు;క్రోధి వర్షమ! చూపు క్రోధమును దయలేకపసి పిల్లలను చెరచు విషపు కాముకులపై;పశుపక్షులను చంపు పరమపాతకులపై;నమ్మించి యేమార్చు నయవంచలటులపై;ప్రజల సంపద దోచి పాలించు ప్రభుతపై;తల్లిదండ్రుల వేచు దయలేని కొడుకుపై;క్రోధి వర్షమ! చూపు ప్రోది యగు ప్రేమమునుపలుచ దీనుల యెడల పరమ కరుణాత్మవై;బలుల దాకని హీన బడుగు జీవులపైన;దైవసన్నిధి మెలగు ధర్మరాజులపైన;(శరము=సిగ్గు;భీరువు=పిరికివాడు;లటులు=దొంగలు;ఏమార్చు=మోసపుచ్ చు;వేచు=బాధించు;ప్రోది=అధికమై న;పలుచ=బలహీనులైన;బలులు=బలవంతు లు;తాకని=ఢీకొనని)
క్రోధము జూపవే క్రోధి!-డాక్టర్ అడిగొప్పుల సదయ్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి