ధీకరా!;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 భాసమానమైన ఘనకీర్తికలిగిన
కవన చైతన్యమును రగిలించి
దరహాసచంద్రికలు పూయించి
గణములు తప్పని పద్యముల
కవిగాయక మన్యుల వుసిగొలిపి
జవజీవముల కలిగించు
భారతమాతృ స్తవముల నొనరించి
కణకణలాడే దేశభక్తిని
సంపూర్ణతను సాధించ వెలిసినారు
కారణజన్ములైన మీ సమూహ
గణమెంత పుణ్యము చేసుకున్నదో
సాధారణమైన విషయమేమీ కాదిది
కరములమోడ్చి మన భారతమాత
గుణగణముల కీర్తించు మా కవి
కసుగాయల కనికరించి మీ పూర్ణకరుణ
సుధలను కురిపించ వేడుతున్నాము ధీకరా!
**************************************
కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
👌✍️🌹🙏🌹
Joshi Madhusudana Sharma చెప్పారు…
👌👏👏🌹🙏🌹