స్ఫూర్తి ప్రదాత;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఒక ధిక్కారం,ఒక ఆత్మవిశ్వాసం
ఖడ్గంతో చరిత్రను తిరగరాసిన తెంపరితనం
దుష్టపాలకుల కంటిమీద
కునుకు లేకుండా చేసిన సాహసం
సామాన్య జనాన్ని
యోధులుగా తీర్చిదిద్దిన నాయకత్వం
ఇలాంటి ధీర లక్షణాలు మూర్తీభవించి
శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ గా అవతరించాయి
షాహపురం కోటను నిర్మించి
వరంగల్, భువనగిరి, గోల్కొండ కోటలను
వశపరుచుకున్న తిరుగులేని మొనగాడు
మహమ్మదీయ పాలకుల దౌర్జన్యాలు,
దొరలు జాగీర్దారుల అక్రమాలు
ఆయనను రాబిన్ హుడ్ గా మార్చాయి
పేదప్రజలకు అండదండగా నిలిచిన
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిజంగా అమరుడు
ఇప్పటికీ,ఎప్పటికీ మన స్ఫూర్తి ప్రదాత 
**************************************


కామెంట్‌లు