వేసవి కాలం వచ్చి0ది! ;- కోరాడ
 బాలల్లారా విన రండి
  వేసవి కాలం వచ్చింది
  బడులకు సెలవులు తెచ్చింది
   ఎండలో తిరుగ వద్ద0డి...! 
  నీడ పట్టునే ఉండండి...!! 

షికారు లైనా... ఆట లైనా.... 
 సాయ0కాలమె మంచిది..! 
 కూల్ డ్రింక్ లు వద్ద0డి
 పలుచని మజ్జిగ మంచిది
 ఆరోగ్యానికి మేల0డి...!! 

గ్రంధాలయాలలో పిల్లల కోసం
  మంచి-మంచి పుస్తకాలెన్నెన్నొ
 చదువు కొనుటకు ఉన్నాయి
 మీరు చక్కగా చదువుకోవచ్చు
 జ్ఞానాన్ని పెంచు కోవచ్చు...! 

పెద్ద వారితో సాయ0కాలం
బీచ్ కు మీరు వెళ్లచ్చు
ఆటలు ఎన్నో ఆడొచ్చు
 హాయిని ఎంతో పొందొచ్చు
 ఆనందముగా గ డ పొచ్చు! 

ఆది వారము అందరు కలిసి
  జూపార్కునకు వెళ్లచ్చు
  రక - రకాల పక్షులను- ,ఎన్నె  న్నో జంతువులను చూడొచ్చు
 వన భోజ నాలు చె య్యొచ్చు! 

ప్రతి రోజూ ఒక గంటయినా
 మీ క్లాసు బుక్స్ ను చదవాలి
 వచ్చిన వన్నీ మరచి పోక
 అవి  మల్లీ - మల్లీ చదవాలి... 
  ఎప్పుడు అడిగిన చెప్పాలి..! 

అరకు లాంటి ప్రదేశాలు
 వీలై తే  తప్పక చూడాలి ,మీ 
వేసవిసెలవులువృధాచేయక
  మీరు వినోదాాన్ని,విజ్ఞానాన్ని
 సమృద్దిగ పొంద గలగాలి...! 

సెలవులన్ని ముగియగనే..... 
 ఉత్సాహముతో ఉల్లాసంగా
 పై తరగతులలో చేరుటకు
  స్కూళ్లకు బయలు దేరాలి
   అందరినీ కలుసుకుని... 
   ఆనందాలను  పంచాలి..!! 
        *******

కామెంట్‌లు