కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 కాళ్లు చేతులు నుదురు మాత్రమే నేలకు తాకేలా నమస్కారం చేయాలని    శాస్త్రం చెప్తుంది. పూజ పూర్తయిన తర్వాత పుష్పాన్ని సమర్పించి సాష్టాంగ నమస్కారం చేయాలి  దైవానికి గురువుకి యతులకు వారు ఎదుటపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి  నోరు విజ్ఞానం చేయడం వల్ల కూడా కొందరిని ఉత్తమ భక్తునిని ఈ సాష్టాంగ నమస్కారం చేసేవారు ముక్తిని పొందుతారు అని  శాస్త్రం తెలిసిన  వేద విదులు చెప్పిన మాట  దీనివల్ల  మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది జీవితం క్రమశిక్షణకు అలవాటు పడుతుంది సమాజంలో వ్యక్తిగా తాను ఎలా ప్రవర్తించాలో తనకు అర్థం అవుతుంది. కనుక అతనిలో దురాలోచనలు  రావడానికి అవకాశం ఉండదు.
పురాణ పురుషునిగా శ్రీరామచంద్రమూర్తిని గుడిలో గోపురాలు కట్టి పూజించడం  వారి సోదరుడైన మిగిలిన ముగ్గురు గురించి అందరికీ తెలుసు  కానీ ఆయనకు అక్క ఉన్నది అని చాలా మందికి తెలియదు ఆమె పేరు శాంత దశరథ కౌసల్య దంపతుల మొదటి సంతానం  దశరథుడికి నలుగురు పుత్రుడు కలగకముందే ఆమెను తన స్నేహితుడు అంగదేశానికి రాజైన హోమపాదులకి దత్తత ఇచ్చారు. ఈమెను పురుష శృంగ మహర్షికి ఇచ్చి వివాహం జరిపించారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ బాలకాండలో 8, 9 సర్గలలోనూ ఈ ప్రస్తావన ఉంది  కర్ణాటకలోని కిగ్గా నేపాల్ లోని లలిత్పూర్ లో హిమాచల్ లోని కూలుకు వద్ద రృశ్యంగా శాంతాదేవి ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాల్లో పూజలు చేస్తూ శ్రీరాముని అనుగ్రహానికి  పాత్రులవుతారని భక్తులు విశ్వసిస్తారు.ఉదయమే పెరుగన్నంలో ఆవకాయ నంజుకుని తింటే ఆ రుచిని వర్ణించడం  ఎవరి తరం కాదని  కాటూరి వెంకటేశ్వరరావు గారు  రచించిన పద్యాలలో ఒకటి  ఆవకాయను నములుతూ కలిపి భోజనం చేసినప్పుడు  రోజు తినేదానికి  రెండింతలు తినడం ఖాయం  మాగాయలు పెరుగులో వేసి తింటే  మరింత రుచి పెరుగుతుంది  మెంతికాయ మోజు పెంచుతుంది  తొక్కుడు పచ్చడి  రుచిని ద్విగుణీకృతం చేస్తుంది  కోరు తొక్కుడు పచ్చడి ఆకలిని పెంచేస్తుంది  బెల్లం కలిపి ఆవకాయ పెరుగన్నానికి కావలి కాస్తుంది  పెసర ఆవకాయ కమతను కడుపు నింపేస్తుంది పులిహోర ఆవకాయ ఘాటు మాడుకు ఎక్కుతుంది  అలాంటి ఆవకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదని  దానిలో ఉన్న పీచు పదార్థం  విరోచనం సాఫీగా అవ్వడానికి సాయపడుతుందని శాస్త్రజ్ఞులు చెబుతారు.

కామెంట్‌లు