ప్రతి మనిషికి మనసు మార్గదర్శి ఇది మంచి ఆలోచనలను కలుగచేస్తుంది చెడ్డ ఆలోచనలకు దారితీస్తుంది బ్రాంతి కలగచేయడంలో దానికి మించినది మరొకటి లేదు మనలో ఏ చెడు అభిప్రాయంతో అది మరొక మాత్రమే తెలియాలి మనలో ఉన్నటువంటి మంచి ప్రపంచమంతా విరిగిపోయేట్లు ఉండాలి మనలో ఏ లోపాలు ఉన్నాయో వాటిని మనలోనే దాచుకోవాలి బహిర్గతం చేయకూడదు ఏదైనా ప్రతిభ మనలో ఉన్నట్లయితే అది ప్రపంచానికి తెలిసేలా ప్రయత్నం చేయాలి మనిషికి సమయం ప్రధానం మాట్లాడాలి అని అనుకుంటే సమయం దొరుకుతుంది వద్దు వాడితో మాట్లాడడం వృధా అనుకున్నప్పుడు ఏదో ఒక సాకు దొరకక తప్పదు అలా తప్పించుకోవచ్చు. మనిషి అన్న తర్వాత అతనికి జీవితంలో కష్టం రాక తప్పదు కొన్ని కష్టాలను భరించాలి మరి కొన్నిటిని నీ బుద్ధిని ఉపయోగించి తప్పించుకోవాలి ఈ కష్టాలను గురించి మీ స్నేహితులతో చెప్పినప్పుడు వారు కొంత ఉపశమనాన్ని కలిగించే మాటలు చెప్పవచ్చు అది ఆ క్షణం వరకే కానీ ఆ కష్టం ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది దానిని ఎలా ఎదుర్కోవాలి అని మూలాలను తెలుసుకొని దానిని ఎదుర్కొంటే శాశ్వతంగా ఆ కష్టం మనకు దూరమవుతుంది నలుగురు చూస్తున్నారు అని వారి మెప్పుకోసం మనం మన పనులను మార్చుకోకూడదు నీవు చేస్తున్న పని మంచిదైనప్పుడు ఆ పనిని సక్రమంగా చేయడానికి ప్రయత్నించాలి తప్ప వదిలి వెయ్యకూడదు ఉత్తములు ప్రారంభించిన పనిని వదిలివేయరు అని పండితులు చెబుతారు. జీవితంలో మనిషి జ్ఞానాన్ని సమపార్జించుకోవడానికి చివరి క్షణం వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి అనేక కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి నీకు ఎంత ఎక్కువ తెలిసిన చాలా తక్కువ తెలిసేనట్లుగానే మాట్లాడాలి తప్ప డాబులు పలకకూడదు జీవితంలో ఏ వ్యక్తి అయినా జీవించడానికి ధనాన్ని సంపాదించాలి నీవు ఎంత సంపాదించావు దాని గురించి మాట్లాడకుండా తక్కువ ఉండేలా మాట్లాడాలి ఒక సమాధానం నీకు చెప్పాలంటే ఏదో ఒక ప్రశ్న ఎవరో ఒకరు అడిగాడు కదా నీవు దేనితోనైనా గెలవాలి అనుకున్నప్పుడు ప్రయత్నం చేసి తీరాలి నీవు గమ్యాన్ని చేరాలి అన్నప్పుడు అనేక మలుపులు దాటక తప్పదు వాటిని కష్టాలుగా భావించక ఇష్టాలుగా చేస్తే విజయాన్ని సాధించగలవు.
కదంబం ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి