ఇది ఎన్నికల
రణక్షేత్రం
ఇక్కడ ఎప్పుడూ
ఓడేది
ఓటరే ?!
ప్రజాస్వామ్య
మనుగడకిదికాదా!
గొడ్డలి పెట్టు?!
ధనికస్వాములు
దయలేని రౌడీలు గుండాలు
బడా పారిశ్రామిక వేత్తలు
సేవాతత్పరులై
అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలబడడం అంటే?!
కొంగ దొంగజపమే యిది
ఉపాధి ఉద్యోగ అవకాశాలు
మృగ్యమై
పాశుపతాస్త్రంలాంటి
ఓటును పైసలకు
అమ్ముకుంటే ?!
ఇక్కడ ఎవరిని
తప్పుపడతావు!?
ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పాటైన వ్యవస్థే! ప్రజాస్వామ్యం.
ఇదిప్పుడు కొంతమంది వ్యక్తుల చేత
వ్యక్తులకొరకు ఏర్పడిన
జేబు సంస్థగా మారితే
ప్రజాస్వామ్యమేడుంది?!
ఇక అంతా నియంతృత్వంతప్పా!
ఇకనైనా మారుదాం
విద్యావంతులు
సేవా గుణం గలవారు
నేరచరిత్ర లేని వారను
పాలకులుగా ఎన్నుకుందాం
ప్రజాస్వామ్యం వ్యవస్థ
వర్థిల్లేలా పాటుపడదాం
ప్రజాస్వామ్యం వర్థిల్లాలి
బడుగు బలహీనులకు
రాజ్యాంగం ప్రకారం అన్ని
అవకాశాలు దక్కితీరాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి