బ్రతుకంటే పోరాటము ;- - అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
బ్రతుకంటే
పోరాటం
కానీ 
 చేవలేనితనంకాదు
బానిసత్వం అసలే కాదు 

బ్రతుకంటే
ఒక లక్ష్యంతో
జీవించడం
కానీ
ఏలాగో అలా
బ్రతికే యడం కాదు
ఆశలు ఆకాంక్షలు
ఆత్మాభిమానం తో
అల్లుకున్నదే
మన (నీ) బ్రతుకు 

బ్రతుకంటే
 పూలబాటే కాదు
ముళ్ళబాటకూడా
జయాపజయాల
సంగమం

బ్రతుకంటే
సంఘీభావం
బ్రతుకంటే
నాయకత్వ పటిమ,
మార్గదర్శకత్వం

బ్రతుకంటే
ఎవరికి వారు బాధ్యతగా
తీర్చిదిద్దుకోవలసిన
జీవన ముఖచిత్రం

కామెంట్‌లు
Popular posts