కాలాన్ని గెలిచానని
విర్రవీగకూ?
కాలాననుసరించి
అడుగులేయడం
నేర్చుకో
నిత్యం డబ్బు యావేనా?!
అన్ని బంధాలు
డబ్బుతో కొనలేవూ
డబ్బు అవసరం మేరకే
ఆత్మీయులు నువ్వున్నంతవరకూ!?
బాధను దిగమ్రింగడం
నేర్చుకో?!
బాధ పెరిగి పెరిగి
బ్రతుకును బలిగొంటుంది?
అది రేపు
చిలికి చిలికి గాలి వానలా!?
నిప్పుతో చెలగాటం ఆడొద్దు
మూర్ఖుడి తో వాదనకు దిగొద్దు
స్థలకాలాదులనుబట్టే
మసలుకోవడంనేర్చుకో
మనుషులకిప్పుడు
మనీ మైకం కమ్ముకున్నది!?
ఏది చూసినా!
కళ్ళకు మనీలా తోస్తుంది!
ఏకాకిని చేయడానికే?
ఆ మనుషులకీ మనీమైకం!?
జీవితమొక
నాటకరంగం
ఇప్పుడు మనం
మన మన పాత్రల్లో జీవిస్తున్నామా?!
నటిస్తున్నమా !అనేది
మనవల్లమేలు
కీడుజరిగినోళ్ళ
నడిగితే మన పాత్రాపోషణ
బయటపడ్డట్టే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి