తేటగీతి పద్యములు.
--------------------------
6.
సోమకాసురు మర్దించి సురల గాచి
వేదరాశిని ముదమున విధికి జేర్చి
మీనరూపము దాల్చిన మేటి నీవె
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
7.
మందరంబెత్తి నిల్పగ మహిమ తోడ
కమఠరూపము దాల్చిన కమల నయన
పొగడ తరమౌన నిన్నిట పూజ నీయ
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
8.
యజ్ఞవారాహమై నీవె నవతరించి
కాశ్యపేయుని దునుమాడి కడిమిజూపి
ధరణి జేపట్టి కాచిన దైవమీవు
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
9.
బలుడగు హిరణ్య కశ్యపున్ బట్టినీవు
సంహరించగ వచ్చితే స్తంభమందు
దైత్యు ప్రహ్లాదు కాపాడు దైవమీవె!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
10.
వామనుండవై యరుదెంచి వాసిగాను
చుట్టు కొల్చితే విశ్వమున్ జూపిమహిమ!
విక్రముడవై సురల గాచు విభుడ వయ్య!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
--------------------------
6.
సోమకాసురు మర్దించి సురల గాచి
వేదరాశిని ముదమున విధికి జేర్చి
మీనరూపము దాల్చిన మేటి నీవె
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
7.
మందరంబెత్తి నిల్పగ మహిమ తోడ
కమఠరూపము దాల్చిన కమల నయన
పొగడ తరమౌన నిన్నిట పూజ నీయ
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
8.
యజ్ఞవారాహమై నీవె నవతరించి
కాశ్యపేయుని దునుమాడి కడిమిజూపి
ధరణి జేపట్టి కాచిన దైవమీవు
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
9.
బలుడగు హిరణ్య కశ్యపున్ బట్టినీవు
సంహరించగ వచ్చితే స్తంభమందు
దైత్యు ప్రహ్లాదు కాపాడు దైవమీవె!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
10.
వామనుండవై యరుదెంచి వాసిగాను
చుట్టు కొల్చితే విశ్వమున్ జూపిమహిమ!
విక్రముడవై సురల గాచు విభుడ వయ్య!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి