నిలకడ మీదే....! ; - కోరాడ నరసింహా రావు
 లోకం తీరే అంత...! 
  బుద్దికి పనిచెప్ప టానికి
   బద్ద కిస్తుంది...! 
  నోరుంది కదాని... 
  తొందరగావాగేస్తుంది...!! 

క్రీ స్తు ను తీవ్రవాది అని
 తెలికగా ముద్ర వేసే సింది! 
షిర్డీ సాయిని  పిచ్చోడని
  ప్రఛారం చేసే సింది...!! 
కృష్ణుని మాయలోడు... 
 మోస గాడు అని తూల నాడే సింది..!!! 

నిలకడ మీద.. 
 నిజం తెలుసు కుని... 
 దేవుళ్లని పూ జిస్తూన్నారు ! 

నీ నిజాయతీని గుర్తించలేదని
శ0కింఛారని
 నిన్ను ఆకారణంగా... 
  నిందిస్తున్నారని ... 
  నిరుత్సాహపడి ... 
  నీరు గారి పోకు...! 

నిజా లెప్పుడూ ... 
  నిలకడ మీదే తెలుస్తాయి..! 
  తిట్టిన నోళ్లే  పొగుడు తాయి
 ఆడి పోసు కున్న నోళ్లే.. 
  అందల  మెక్కిస్తాయి...!! 
      *******

కామెంట్‌లు