నాటి కుటుంబం ;- ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
మూడు తరాల వారండి
కలిసిమెలిసి ఉన్నారు
చక్కనైన కుటుంబం
అది సమిష్టి కుటుంబం!!

తాత అవ్వలున్నారు
అమ్మానాన్నలన్నారు
చిన్నాన పెద్దనాన్నలున్నారు
అత్తమామలు ఉన్నారు!!

ఇంటి నిండా పిల్లలతో
కంటి నిండా జ్యోతులతో
ఒంటి నిండా శక్తితో
తంట లేని కుటుంబం!!

అందమైన కుటుంబం
ఆనందాల కుటుంబం
మూడు తరాల కుటుంబం
ముద్దులొలికే కుటుంబం!!


కామెంట్‌లు