సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు
మాకు తండ్రి అని సాధరంగా
కలిపినావు బంధువుల నందరీ
సంగీత మూర్తి, గీత గానంలో
భక్తి నింపి, భక్తి పారవశ్యాన
భగవంతుని బంధువులతో
బంధుత్వం కలిపిన ఓ
మహానుభావా ఇవే నీకు
సుమాంజలులు, వందనాలు.
ఏది గొప్పది కాదు రాముని
సన్నిధే ముఖ్యమని నిధుల
త్రోసి రాజన్నావు, ఓ సంగీత
రాజేంద్ర నీకివే పాదాభివందనాలు
బ్రోవ మని ప్రార్థిస్తూ మేము నీకు
భారమా అంటూ వాపోయి
రాముని పై పొందుపరిచిన
ప్రేమ భక్తులని అర్పించు
త్యాగమూర్తి ఓ త్యాగరాజ
ఏమని పొగడదు, అప్పుడే
చిన్న వయసు న, ఎందరో
మహానుభావులని, అందరికీ
నర్మగర్భంగా వందనాలు అర్పించిన
తేజో మూర్తి, నీ వయస్సు 13 కదా
పువ్వు పుట్టగనే పరిమళించు
నీ కీర్తి ఆ చంద్రార్కం అమోఘం
ప్రతి దిక్కులో ప్రతి మనిషిలో
ప్రతిగళంలో, పొందుపరచబడింది
ఓ త్యాగరాజ రాముని సన్నిధి చేర
మము మరిచినావా, నీ ఆశీస్సులు
నీ ప్రేమాభిమానాలు మాకు
శ్రీరాముని కృపతో వర్షించి
ఈ ధరణిని పాపాల నుండి
విముక్తి చేయగా రావా మహాత్మా!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి