కుల, మత, వర్గ, వర్ణ, జాతి
వివక్ష లేనివాడు
తన, పర భేదం చూపనివాడు
ప్రేమ, ద్వేషం ఎరుగని వాడు
రోగగ్రస్థ శరీరభాగాలను
నిర్దాక్షిణ్యంగా తొలగించే
జాలిగుండె కలవాడు
చేదుమందిస్తూ రోగాన్నితగ్గించే
తీయని మనసున్నవాడు
శారీరకరోగమే కాదు
మానసికరోగానికీ వైద్యం చేసేవాడు
ఆరోగ్య ప్రేమికుడు
అనారోగ్య నిర్మూలకుడు
అతనిచేతిలో కత్తెరలు
కూచిపూడినాట్యం చేస్తాయి
కత్తులు కథాకళిని నర్తిస్తాయి
శ్రావణాలు చెడుగుడు ఆడుతాయి
సూదులు చిందులు వేస్తాయి
సిరంజీలు సరిగమలు ఆలపిస్తాయి
అతడు కత్తెరలూ, సూదులూ ఉన్నా దర్జీ కాడు
చాకులూ, కత్తులూ ఉన్నా సైనికుడు కాడు
రోగాల రక్కసుల దునుమాడే శ్రీహరి
జీవులను కాపాడే దేవుడు
అందుకే
వైద్యో నారాయణో హరిః అన్నారు పెద్దలు!!!
**************************************
దేవుడు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

శ్రీ గౌరవరాజు సతీష్ కుమార్ గారికి!
-ప్రాసకవితల రామతాత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి