సమిధలు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 
దినదినగండం నూరేళ్ళాయుష్షుగా
కార్మికలోకపు ఉషోదయం
కండలు కరిగించి, స్వేదం చిందించి
కష్టాలన్నీ చిరునవ్వుతో సహించి
బతుకుపోరాటంలో ముందుండే యోధులు
వారి అస్త్రాలూ,శస్త్రాలూ వారి శ్రమే కదా!
పిడికిలి బిగించి
అభివృద్ధికి బాటలు పరిచేందుకు
సదా నడుంబిగించి
మానవాళి అస్తిత్వాన్ని
నిలబెట్టే శ్రమైక దేవతలు
రెక్కాడితేగాని డొక్కాడని
జీవిత పంజర బందీలు
జీవితంలో గొప్ప ఆశలకు
ఆశయాలకు పోని అల్పజీవులు
తరతరాల వారసత్వపు సమిధలు
ఈ నిరంతర శ్రామికులు !!
**************************************

కామెంట్‌లు