711)అనలః -
అపరిమిత శక్తిగలవాడు
అంతులేని సంపదలున్నవాడు
అగ్ని సమానమైయున్నవాడు
దహింపజేయగలిగినవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
712)దర్పహాః -
దుష్టచిత్తుల అణిచివేయువాడు
హద్దులుమీరినవార్ని తృంచువాడు
మంచి స్థాయిలో నున్నట్టివాడు
దర్పం చూపుతున్నట్టి వాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
713)దర్పః -
ధర్మంతో చరించుచున్నవాడు
దర్పము గలిగినట్టి వాడు
ఆత్మగౌరవం నిండియున్నవాడు
హుందాతనము గలిగినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
714)దృప్తః -
సదా ఆత్మకు నందమొసగువాడు
దర్పించినట్టి హృదయమున్నవాడు
మనోగర్వము నిలిచినవాడు
ఆత్మబలమున్నట్టి వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
715)దుర్ధరః -
ధ్యానించ సాధ్యముకానట్టివాడు
భరించలేనట్టి దివ్యాత్ముడు
ధరింపకూడని మహిమాన్వితుడు
బంధించలేని తేజమున్నవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి