దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు దశాబ్దాలుగా రహదారుల సౌకర్యాలు కలగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికీ గిరిజనులు ప్రమాదకరమైన వాగులు, వంకలు దాటి వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి . వైద్యసేవలు కొరకు గర్భిణీ స్త్రీలు నేటికీ డోలు మోతలు తప్పడం లేదు.
ఆదివాసీ మహిళలను రక్తహీనత సమస్య వెంటాడుతోంది. అంతేకాకుండా ఆదివాసీ మహిళ లకు ప్రసవమంటే పునర్‌జన్మగా మారింది. సకాలంలో వైద్యం అందక పోవడంతో మాతాశిశు మరణాల రేటు పెరుగుతూ వస్తుంది. ఆదివాసీ లు ఆచార, సంప్రదాయాలకు కట్టుబడి మూఢవిశ్వాసాలతో జీవనం సాగిస్తున్నారు. అలాగే తరతరాలుగా వెంటాడు తున్న రక్తహీనత సమస్యతో పాటు పౌష్టికాహార లోపం తో ఆదివాసీలు బక్కచిక్కిపోయి బలహీన పడుతున్నా రు. దీంతో ఆదివాసీలను భయంకర వ్యాధులు చుట్టు ముట్టి యేటా ఎంతో మంది మృత్యువాత పడుతున్నా రు. అదేవిఽధగా ఏజెన్సీలోని ఆదివాసీలను వెంటాడు తున్న పేదరికం, అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో వారు సతమతమవుతున్నారు.
గిరిజన జనాభా:
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశపు గిరిజన సంఘాలు దేశ జనాభాలో 8.6% ఉన్నారు . అయితే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశ అభివృద్ధి పిరమిడ్‌లో వారు అట్టడుగున ఉన్నారు .
దేశంలోని 80% గిరిజన సంఘాలకు మధ్య భారతదేశంలోనే ఉంది .257 షెడ్యూల్డ్ తెగ జిల్లాలలో , 230 (90%) అడవులు లేదా కొండలు లేదా పొడిగా ఉంటాయి. కానీ భారతదేశంలోని గిరిజన జనాభాలో 80% మంది ఉన్నారు. పారిశుద్ధ్యం, విద్య, పౌష్టికాహారం, తాగునీరు, విద్య అందుబాటులోకి వచ్చినా స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నప్పటికీ ఆదివాసీలు అత్యంత వెనుకబడి ఉన్నారు.ఒంటరిగా మరియు నిశ్శబ్దాన్ని ఇష్టపడే అనేక గిరిజన సంఘాలు ఉన్నాయి. వారు సిగ్గుపడతారు మరియు వారి స్వంతంగా బయటి ప్రపంచానికి చేరుకోలేరు. దేశంలోని విధాన నిర్ణేతలు మరియు నాయకులు ఈ లక్షణాన్ని అర్థం చేసుకోవాలి మరియు ఆదివాసీల సంక్షేమం కోసం పని చేయాలి, తద్వారా వారు వారితో మెరుగైన మార్గంలో కనెక్ట్ అవుతారు
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.వారి అబివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి- సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి