మోడుగ మారిన కొమ్మలపై
కురిసిన కలతల కన్నీరు
వీడను మనసురాక
తోడుగా ఉండిపోయేనా??
కనిపించని మమతల ముడి
కరుణించని కాలపు వేగంలో
వినిపించని ఆశల సవ్వడి
పట్టి ఉంచేనా చెమ్మల తడి?
అనురాగాల పందిరిని
అల్లుకుని కలిసిపోయిన
అభిమానపు ముత్యాల జల్లు
చిగురులు వచ్చేవరకూ నిలిచేనా?
వేసారిన గుండెల మంటకు
హత్తుకుని ఓదార్చే బంధం
పంచే ప్రేమల విలువకు
సాటి అయినది జగాన ఉందా?
కడవరకూ తోడుంటానని
విడిపోక నడిపిస్తానని
మౌనంగా ధైర్యాన్నిస్తూ...
ముందడుగు వేయించే
వేకువ నేస్తానికి
🌸🌸 సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి