సమస్యల సుడిగుండాలు
ఆపలేని అవరోధాలు
దిక్కుతోచని బేలతనం
మొక్కే దేవుడే ఆధారం
కమ్ముకున్న చీకటిని
చీలుస్తూ వెలుగులు చిందిస్తూ
ముంగిటిలో పేరుకున్న
కలతలు కరిగిస్తూ.....వస్తున్న రేపు
అణగి ఉన్న అసహనం
అదుపు చేయలేని కోపం
అలవాటైన నిర్లిప్తత
అన్నీ కలిసిన అంతరంగాన
మాటరాని మౌనాలకు
అక్షర సాయం లేని భావాలకు
మదిని తొలిచే వెతలకు
స్వేఛ్ఛ దొరికేదెపుడు??
అనర్థాలకు మూలమైన
అపార్థాలకు దారితీసిన
వ్యర్థమైన వాదనలకు
అర్థాలు వెదకడం దేనికీ?
ఏది వచ్చినా కలకాలం
నిలిచే సమస్యే లేదు.
కదిలిపోయే అలలే కాదా!
వచ్చే ఉదయం తెచ్చే మార్పు
ఓర్పుగా వేచిన మనసుకు తీర్పు
అదిగో!... వెలిగెను తూరుపు...
అలసిన మనసుకు ఓదార్పు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి