ఓ శ్రీ శ్రీ...! ;-
నీ కలం కత్తై పెట్టు బడి దారీ శ్రమ దోపిడిని చీల్చిచెండా డింది...!
నీ పెన్ను గన్నయి వదిలిన అక్షర తూటాలు అన్యాయాక్రమాలను గడ -.గ డ లాడింఛాయి...!!
నీ భావఝరీ రధ చక్రాలక్రింద అపసవ్యాలు నలిగి నుజ్జయి నాయి...!
నీ సాహితీ వీర్యసారం పుడమితల్లికి పురిటి నొప్పులు తెప్పించ గలిగి నవ్య సృష్ఠికి నా0ది పలికించాయి...!
నీతోనే సాహిత్య నవ శకం...!
నీ సాహిత్యానికి జరా, మరణ ములు లేవు... రావు..!!
నీవు చరిత్ర కారుడవు....
సాహిత్య పదానికే బాష్యం చెప్పే నీ కవిత్వమే నిజ సాహిత్యం...!
నీకిదే నా వందనం💐🙏🌷
********
ఓ శ్రీ శ్రీ...! ;- ... కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి