వేసవిసెగలకు పన్నీటి జల్లులు ;- కొప్పరపు తాయారు
అలిగిన సూర్యుడు
ఆకాశమున నిప్పులు కురవ 
మేఘములు జాలితో
బిడ్డలపై వాన కురిపించే

కలియుగ ప్రకృతి 
ధర్మం, పరకాయ ప్రవేశం 
అందుకే పాటిద్దాం ప్రజలెల్లరూ
ధర్మ పదం, అది అదృష్టం 

దుష్ట ఆలోచన, కర్మ ప్రాప్తి 
 అనుభవైకం, ప్రయోగాత్మక 
జీవులం గ్రహాల పైన చంద్రుడు పైన 
సముద్రంలో, ఎక్కడనక అక్కడ 

ఖాళీ ఎక్కువగా ఉంటే 
ప్రయోగాలు _ ప్రాణాలను 
విషవాయువుల, రసాయనిక
పరమాణువుల విస్పోటనం తో

అంతా  కాలుష్యమే
సరైన దృక్పథం, సక్రమమైన 
 మార్గం, మనుగడికి, ప్రకృతి 
పరవశించి, పచ్చని భూమికి 

పండుగ చూడ, పరువళ్ళుతొక్కు
అప్పుడు సంతోషాలే
ప్రకృతి మనకై త్యాగం 
 చేయ, తనని ,ధర్మాన్ని 
కాపాడుట కస్టమా !!!


కామెంట్‌లు