నేటి బ్రతుకులు;- ఎడ్ల లక్ష్మి
నీవు నేను అంటారు
ఒంటరిగానే ఉంటారు
పెద్దలను వద్దంటారు
ప్రేమలు మరచి పోతారు !!

పరులనే కావాలంటారు
పరుగులు తీస్తూ పోతారు
మరుగున మనసు దాస్తారు
మెరుగులు దిద్దుకుంటారు !!

ఇరుగుపొరుగు అంటారు
ఇంటి వారిని మరుస్తారు
ఇతవులెన్నో చెప్పుతారు
సతమతమవుతుంటారు !!

బ్రతుకుదారులు విడుస్తారు
మతి తప్పి పనులు చేస్తారు
మితిమీరి మాటలంటారు
సొంత వారినే వదులుతారు !!

కామెంట్‌లు