ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మనిషి ఇష్టమైతే పేరు మార్చేస్తాను అన్నాడు మోహన్ అది మా స్కూల్ ఫైన్ దశలో జరిగిన సంఘటన తర్వాత ఇద్దరo  లైలా చదువుతూ ఇద్దరo హాస్టల్ లోనే ఉండి చదువుకున్నాము అక్కడ చదువుతున్నప్పుడే ప్రపంచ క్యాథలిక్ క్రైస్తవ మహాసభలకు  ఆంధ్రదేశం నుంచి ఇద్దర్ని పంపగా వారిలో నేను ఒకడిని ఆ సంవత్సరం విశాఖపట్నం ఇంటర్ కాలేజ్ యేటు కు హితశ్రీ గారి విముక్తుడు నాటికను తీసుకొని ప్రదర్శించాను లయూలా కళాశాల నుంచి అదే మొదటి నాటకం ప్రదర్శన జరుగుతుండగా వర్షం రావడం రిజిస్టార్ గారు నాటకం ఆపి హాలుకు  మార్చి అక్కడ కొనసాగించడంతో నాయుడు గారితో నాకు పరిచయం ఆ నాటికలో నాకు బహుమతి రావడం వల్ల.   అభినంధిస్తూ వచ్చే సంవత్సరంలో విశాఖపట్నం రా అన్నారు.
అన్ని  వేషాలు నువ్వే వేయాలి అని మాట తీసుకున్నాడు ఆ తర్వాత అలా ఆర్థిక పరిస్థితులు సరిపడక ఎస్ఆర్ కాలేజీలో చదివాను అప్పుడు మోహన్ విశాఖ  లో. చదువుతున్నాడు నాయుడు గారు మూడు నెలల తర్వాత కబురు చేసి రమ్మన్నారు మోహన్ ఇక్కడ పరిస్థితులకు నీవు.  సరిపడవు నిన్ను విపరీతంగా ఇష్టపడుతున్నారు నీవు రావడం లేదని ఎల్లుండి వాడికి చెప్తాను అని నాకు చెప్పాడు  ఆ విధంగా నేను విశాఖపట్నం వెళ్లలేకపోయాను ఆ తర్వాత మోహన్ దిగిన ఆ ఫోటో చూసి జైహింద్ సత్యంగారు అప్పట్లో రంగులరాట్నం సినిమా కోసం బి.ఎన్.రెడ్డి గారు నూతన నటుల కోసం వెతుకుతున్న సందర్భంగా  నాకు కబుర్లు చేశారు  ఆ కబురు పెండ్యాల నాగేశ్వరరావు గారి ద్వారా నేను అంతకుముందే నాకు పరిచయం వున్న మూర్తిగారు చిరంజీవీ నీవు హాయిగా రేడియోలో బ్రతుకుతున్నావు.
నీ మనస్తత్వం ఇక్కడ సరిపడదు మనది కళాకారుల కుటుంబం కళ ని ఆశ్రయించి బ్రతికే వాళ్ళం ఎప్పటికైనా మరణం తప్పదు ఆ చావడం అందంగా చనిపో దాం నీవు రేడియోలో ఉంటే తేనె లో పడ్డ ఈగ లా చనిపోతావు ఇక్కడికి వస్తే కఫం లో పురుగు లా చనిపోతావు నిర్ణయం నీదే అన్నారు అలా ఆ అవకాశం పోయింది ఆ తర్వాత అశ్వినీ దత్తు వైజయంతి మూవీస్ ద్వారా వారి చిత్రాల లో చిన్నచిన్న వేషాలు  వేశాను మధుసూదన్ రావు వారి దర్శకత్వంలో కోదండరామిరెడ్డి ద్వారా ఒక సినిమాలో  మలయాళ నటి నమిత తండ్రిగా నటించి నా సినిమా వ్యామోహం కూడా తీర్చుకున్నాను తల్లి  గా అన్నపూర్ణ అప్పటివరకు ఆకాశవాణిలో ఉంది  ఉమా పేరుతో ఉంది ఆమె కూ అదే మొదటి సినిమా.


కామెంట్‌లు