చిన్న చూపు ;- అంకాల సోమయ్య దేవరుప్పులజనగాం9640748497
అతనిని చిన్న చూపు చూడడం 
 అంటే?!
అతని ఉనికిని ప్రశ్నార్థకం చేయడమే కదా!?
చిన్న చూపు చూడడం అంటే ?
అతనిపాలిట
అది అణువిస్ఫోటనంలాంటిది కదా!?
చిన్న చూపు చూడడం అంటే?
 పిలిచి అగౌరవ పరచడమే కదా!?
చిన్న చూపు చూడడం అంటే? తమలో ఒకడిగా చూడకపోవడమేకదా!?
చిన్న చూపు చూడడం అంటే
తాము కవి అవునా? కాదా!
 అనే
సంశయాన్ని సదరు కవికి కల్గించడమేకదా!?
ఇన్ని కోణాల్లో ఒక చిన్న చూపు ను అర్థం చేసుకునే ప్రమాదముంది!?
జాగురూకులుగా ఉందాం !
మనదంతా ఒకటే కులం 
అదే‌ కవికులం! మనదంతా ఒకటే మతం
అదే మానవత్వం,!సమానత్వం!!
సమసమాజం!!!
మనలో అరసం ,విరసం ,సరసం
తెరసం  ,మరసం అనే  సంఘాలెన్నున్నా
సామాజిక చైతన్యమే 
వాటి (మన )ఏకైక లక్ష్యమై ఉండాలి
నియమనిబంధనల్లో సార్వజనీనత ఉంటే సరిపోతుందా?!
అమలులో మీనమేషాలు లెక్కించడం దేనికీ!?
పై విషయాలు అతి అయితే తుడిపేయండి!?
అవసరం అయితే వాడుకోండి
 

కామెంట్‌లు