అమ్మ ;- అంకాల సోమయ్య దేవరుప్పుల జనగాం 9640748497
మన జన్మకు కారణమమ్మా
మన ఎదుగుదలకు బాసట అమ్మ
మన విజయబావుటాఅమ్మ
మన కలల కాణాచి అమ్మ

తన స్తన్యం మనకిచ్చి
తన ఒడిని బడి చేసి ఆది గురువై
 మనల్ని మానవీయులుగా మలచిన అపర శిల్పి అన్నపూర్ణేశ్వరి అమ్మ

చందమామ రావే జాబిల్లి రావే అంటూ
పసితనాననే జాబిల్లిని చేతికిచ్చి నోటికి ఉగ్గునందించి
మనకు లక్ష్యం నిర్దేశించి ,మన
భవిష్యత్తుకు వారధైనది అమ్మ

అజ్ఞానులమైన మనకు
అక్షరాయుధం మిచ్చి విజ్ఞాన
సర్వస్వమైనదమ్మ
అమ్మను నిర్వచించాలంటే 
అమ్మా అనే వ్రాయాలి
మరో పదం రాయడం అసాధ్యమే

అమ్మ తన ఊహను మనతో ఆవిష్కరిస్తూ---+
తదాత్మీకరణం చెందే అమృతమయి
అనంత చైతన్య శీలి, కార్యశీలి
కామిత ఫలదాయిని అమ్మ

అమ్మను పంపొద్దు వృద్ధాశ్రమం
అమ్మను ఆదరిద్దాం 
అమ్మ ను అనాథను చేయొద్దు
అమ్మను మన పిల్లల్లో ఒకరిగా చూద్దాం
 అమ్మకు ప్రణమిల్లి
 దీర్ఘాయుల మౌదాం



కామెంట్‌లు