ప్రాజ్ఞ్గనన్నయ్య నుండి జాలువారిన కవిత్వం ప్రపంచ పదులైన కొనసాగింపు
కవిత్వం చిరంజీవి ముగింపులేనిది కలం కవిత
కవిత్వమూ గొప్ప ఆయుధమే
పువ్వుతో చిరునవ్వుతో విచ్చు కత్తులు రువ్విన కలం పండించిన ఆకుపచ్చ స్వేచ్ఛాక్షరం
గొప్ప కవి ప్రకృతి ప్రేమికుడు
అమలిన భాషను హత్తుకున్న యజ్ఞంలో ప్రణయ ప్రబంధకావ్యాల సరసన సరసమైన అంతరంగం
లోపలి బయటి మనిషినీ ఆకట్టుకున్న మాట లేట్ కాదు లేటెస్ట్
ఎంత హృద్యం మరెంత సుందరం
భారత భారతి గళసీమ మెరిసే తెలుగు ప్రాణం సినారె కవిత
కంఠం మోగిన కంచుధ్వని
అక్షరం తెరిచిన కిటికి మనిషికవిత
విస్తరించిన సాహిత్యంలో విచ్చినది
తొలుత నవ్వని పువ్వు నవ్వింది
విశ్వంభర మోము వెలిగించిన కలం
జ్ఞాన పీఠం అందుకున్న మనిషి కవిత్వం
మనిషిని ప్రేమించకున్న కవిత
మనిషి కవిత్వం కాదు
ప్రేమించిన అక్షర సృష్టి నిలబడ్డది విశ్వ కవిత్వ రూపమై విశ్వంభరగా
మొలకెత్తిన విత్తనం సాహితీ వట వృక్షమైన వీచే గాలితీరు
బహుశా హమేషా నిన్నూ నన్నూ పలకరించే కలం గళం
వ్యాసోపన్యాసాల మేలి సంగమ గీతసంగీత వర సమ్మేళనం నీదే
ఓ సినారే! సాహిత్యం బతికినంత కాలం
మీ జీవం ప్రవహిస్తున్న తేట తేనెల తరంగిణి
ఈ నేల వెలిసిన వెలుగుల పదం
భావోద్వేగాల తటి మీటిన కవిత
విశ్వ విశ్వంభర పాట నాటిన సినారె
మట్టి చెక్కిన ఆకాశం సినారె కవిత

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి