996)శారంగ ధన్వా-
==============
శారంగమను ధనుస్సున్నవాడు
శార్జ్గమును ధరించియున్నవాడు
రంగనాథుని అవతారమున్నవాడు
శారంగధన్వా నామమున్నవాడు
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
997)గదాధరః -
కౌమోదకియను గదయున్నవాడు
గదాధరుడయి నిలిచినవాడు
చక్కని గదాయుధం చేబూనినవాడు
శ్రీమహావిష్ణువు అవతారుడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
998)రథాoగపాణిః -
చక్రాయుధము చేతనున్నవాడు
సుదర్శనమును ధరించినవాడు
చక్రీ యనుపేరున్నట్టి వాడు
చక్రధారిగా భాసిల్లు భగవంతుడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
999)అక్షోభ్యః -
ఎటువంటి కలవరములేనివాడు
క్షోభలను ఎరుగనట్టివాడు
వేదనానుభవాలు తెలియనివాడు
అక్షోభ్య నామధేయముగలవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
1000)సర్వ ప్రహరణాయుధః-
సర్వవిధ ఆయుధాలున్నట్టివాడు
సకలాయుధముల ప్రయోగితుడు
ఆయుధప్రహరణము చేయువాడు
దుష్టులనాయుధాలతో దండించువాడు
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి