విశ్వమంతా గాఢనిద్రలో
తలమునకలైనప్పుడు
నేను మంచి నిద్రనుండి మేల్కొని
బిడియంతో మౌనాన్ని ఆశ్రయించాను
నిన్ను చూడడం కోసం
నక్షత్రాలన్నీ వరుసబెట్టి నిలబడ్డాయి
ఆకాశం కూడా మేఘాల మేకప్ తీసేసుకుంది
చుక్కలు గుసగుసలాడాయి
"అతనిక్కడే ఉన్నాడు త్వరగా తెములు" అని
నా తటపటాయింపును చూసిన గులాబీలు
తమ భరోసాను చిరునవ్వుల రూపంలో ఇచ్చాయి
త్వరగా అతనితో మాట్లాడమని
సోమాకాశాలు రెండూ బలవంతపెట్టాయి
అకస్మాత్తుగా నేను మేల్కొన్నా
కాని, అప్పటికే తెల్లారిపోయింది
భక్తి, వ్యామోహములనే నా
స్వీయ ప్రపంచ ద్వారాలు
నావెనుకే మూసుకున్నాయి
విచారంలో మునిగిన నేను
ఇంకా మరిన్ని రాత్రులు కూడా
నాకోసం మిగిలే ఉన్నాయి కదూ?!
అని జ్ఞాపకం చేసుకున్నాను!!
**************************************
తలమునకలైనప్పుడు
నేను మంచి నిద్రనుండి మేల్కొని
బిడియంతో మౌనాన్ని ఆశ్రయించాను
నిన్ను చూడడం కోసం
నక్షత్రాలన్నీ వరుసబెట్టి నిలబడ్డాయి
ఆకాశం కూడా మేఘాల మేకప్ తీసేసుకుంది
చుక్కలు గుసగుసలాడాయి
"అతనిక్కడే ఉన్నాడు త్వరగా తెములు" అని
నా తటపటాయింపును చూసిన గులాబీలు
తమ భరోసాను చిరునవ్వుల రూపంలో ఇచ్చాయి
త్వరగా అతనితో మాట్లాడమని
సోమాకాశాలు రెండూ బలవంతపెట్టాయి
అకస్మాత్తుగా నేను మేల్కొన్నా
కాని, అప్పటికే తెల్లారిపోయింది
భక్తి, వ్యామోహములనే నా
స్వీయ ప్రపంచ ద్వారాలు
నావెనుకే మూసుకున్నాయి
విచారంలో మునిగిన నేను
ఇంకా మరిన్ని రాత్రులు కూడా
నాకోసం మిగిలే ఉన్నాయి కదూ?!
అని జ్ఞాపకం చేసుకున్నాను!!
**************************************

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి