వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 పిల్లల పెంపకం ఎలా ఉండాలి  వారి భవిష్యత్తు  బాగుపడడానికి తల్లిదండ్రులు ఏ పద్ధతులను అవలంబించాలి అనే విషయం గుడిపాటి వెంకటచలం గారు  తన పుస్తకంలో వివరంగా వ్రాశారు బెదిరించి కొట్టి వారిని నానా హింసలు పెట్టి  ఇది చేయి అంటే వారు జన్మలో వారు చేయరు  అదే లాలనగా  ముద్దుగా ఇలా చేస్తే ఎలా ఉంటుంది నాన్న  నీ స్నేహాలు పెరగాలంటే ఎలా ప్రవర్తించాలి  వారితో ఎలా మాట్లాడితే  స్నేహం ఎక్కువ కాలం నిలుస్తుందో  చెప్పాలి  ఒకరి కోసం మరొకరు ప్రాణాలను ఇచ్చుకునే స్నేహాలు కావాలి తప్ప ఆ క్షణాల్లో  తమ అవసరాలను తీర్చుకునేవిగా ఉండకూడదు అన్న విషయాన్ని పిల్లలకు స్పష్టంగా తెలియజేస్తే  వారు ఆ పద్ధతిని అనుసరించి  మంచి బాలునిగా వృద్ధిలోనికి వస్తారు.మనం గమనించినట్లయితే  ఏ చిన్న పనిలో చిన్న దేవాలయం ఉన్నా అక్కడ భక్తులు ఎక్కువగా ఉంటారు  భగవంతుని పూజకు  వారి దయకు  పాత్రులు కావాలని వచ్చే భక్తులు నిజమైన భక్తితో వస్తున్నారా  తమ పాపాలు కడిగి వేసుకోవాలని  ఆ ప్రయత్నంలో వస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచించినట్లు  అయితే ఈ కలియుగంలో పాపం బాగా పెరిగింది అని చెప్పవచ్చు తాను చేసిన చెడ్డ పనులు ఏమిటో తన మనసుకు తెలుసు  వాటిని క్షమించే గుణం ఒక భగవంతుడికి ఉన్నదని అతని నమ్మకం  కనుక గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది  ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు అతి తక్కువ  ఈనాడు  లక్షల మంది వెడుతున్నారు  దర్శనం కోసం వరుసలో 24 గంటల వరకు కూడా వేచి ఉంటున్నారు.ప్రతి ఇంటిలోనూ  అనుకూల శక్తి ప్రతికూల శక్తి  రెండు కలిసే ఉంటాయి  ఈ రెండిట్లో దేని శాతం ఎక్కువ ఉంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది  దానిని ఇంటి నుంచి  తొలగించుకోవడానికి మన పెద్దలు ఏం చేస్తూ ఉంటారంటే గుగ్గిలంతో కలిపిన సాంబ్రాణి ధూపం వేస్తారు  గుగ్గిలంతో కూడిన సాంబ్రాణి పొగ వేయటం ద్వారా  ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ఇంటి నుంచి తొలగిపోతుంది అని ఒక నమ్మకం  ఈ పొగ వేయడం వలన ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితం పొందవచ్చు  నమ్మకద్రోహం ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం పెద్దల   మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి ఆ ఇంటికి ఆర్థికంగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది  అని మన పెద్దలు ఆ పని చేస్తూ ఉంటారు  దీని వలన రోగ కారక క్రిములు  కూడా నాశనం అవుతాయి  అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు
=================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు