రేకులు విప్పిన పూలకి మల్లే
రేపటి కోసం ఆశగ చూసే కలలెన్నో!
సన్నగ సాగే సెలయేటికి మల్లే
కరిగిపోతున్న క్షణాలెన్నో!
గమ్యం తెలియని గమనమల్లే
సాగిపోయే జీవితాలెన్నో!
ఒడ్డున పూచిన గడ్డిపువ్వులల్లే
తాకి కుశలం అడిగే ప్రేమలెన్నో!
తాకలేని రెల్లుపూవుల మనసులో విప్పి చెప్పలేని శోకమేదో!
తీరని వెతలే కథలై పోయే
బ్రతుకు దారుల స్నేహాలెన్నో!
చిక్కుపడిన అదృష్టాలను
విడదీసి వేదన తీర్చే కోరికలెన్నో!
చుక్కల దారిని చంద్రుడల్లే
మక్కువలన్నీ పోగుపడిన బంధాలెన్నో!
గుచ్చని గుణముతో ప్రాణమై
నచ్చే మనసున్న నేస్తాలెన్నో!
నిండుగ పారే ఏటికి మల్లే
మెండుగ నిండే సంతోషాలెన్నో!
చీకటివెలుగుల దోబూచులాటలో
తోడుగ నడిచే దైవంలాగా..
రేపటి కోసం చీకటి మూసిన
రెప్పల వెనుక స్వప్నాలకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి